Dear Uma: దియా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యూత్ ఫుల్ హీరో పృద్వి అంబర్ హీరోగా, సమయ రెడ్డి హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డియర్ ఉమ. ఎన్నో సినిమాలకు, విజువల్స్ అందించిన కెమెరామెన్ రాజు తోట ఈ సినిమాకి పని చేస్తున్నాడు. సూపర్ హిట్ మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్ రధన్ ఈ సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేశారు. ఈ సినిమా ఏప్రిల్ 18 న ధియేటర్ లలో రానుంది. ఈ సినిమాలో మెడికల్ మాఫియాను అరికట్టే అంశాలను చూపించినట్లు టీజర్ ద్వారా మనకే అర్థమవుతుంది. ఈ సినిమా టీజర్, పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
ట్రైలర్ ఇలా సాగింది ..
ట్రైలర్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ నువ్వు రాక్ స్టార్ వి అని హీరోకి, తను చేయాల్సిన పనిని గుర్తు చేస్తుంది. హీరోయిన్ మెడికల్ స్టూడెంట్ గా సినిమాలో మనకి కనిపించనున్నారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే యాక్షన్, లవ్, రొమాన్స్ అన్ని ఈ ట్రైలర్లో మనం చూడొచ్చు. ఒక రాక్ స్టార్, ఒక మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే అమ్మాయికి జరిగే ప్రేమ కథగా కార్పొరేట్ మెడికల్ దందాను అరికట్టాలి అని హీరో చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. యూత్ కి కనెక్ట్ అయ్యే మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి మ్యూజిక్ రధన్ అందించడం మరో విశేషం.
హీరోయిన్ కు వున్న మరో ప్రత్యేకత ప్రత్యేకత ..
తెలుగు హీరోయిన్స్ గా తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో పరిచయం అవడం చక్కటి పరిణామం అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచో హీరోయిన్స్ ని తీసుకువచ్చి ఇక్కడ తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇస్తుంటారు డైరెక్టర్స్. కానీ తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయమవుతూ, తానే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా, రైటర్ గా వ్యవహరించడం ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత. తాజాగా విడుదల చేసిన టీజర్ కు యూట్యూబ్ లో వన్ మిలియన్స్ పైగా వ్యూస్ ను రాబట్టింది. ఒక రాక్ స్టార్ కు సాధారణమైన యువతకి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది. వారి ప్రేమ మధ్యలో ఆగిపోవడానికి వారి మధ్య ఉన్న అపోహలకు కారణం ఏమిటి? కష్టాల్లో ఉన్న హీరోయిన్ ని కాపాడేందుకు ఆ హీరో ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన అంశాలు. ఈ సినిమా గ్లిమ్స్, పోస్టర్ అంచనాలు భారీగా పెంచేశాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వేసవి కానుకగా ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో రానుంది.
Also read: Kalyan Ram: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జాతరే.. తమ్ముడు వస్తున్నాడు