Prabhas : ‘సలార్’ మూవీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన తర్వాత ప్రభాస్ (Prabhas)కు మరింత జోష్ ఇచ్చిన మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . ఈ సినిమాలో అదిరిపోయి యాక్షన్స్ సన్నివేశాలు ప్రభాస్ అభిమానులకు థియేటర్లలో పూనకాలు వచ్చేలా చేశాయి. ముఖ్యంగా అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రభాస్ అభిమానులతో సహా మూవీ లవర్స్ ని సైతం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన యాక్షన్స్ సీన్స్ అన్ని ఫేకే అనిపించేలా ఉంది ఆ వీడియో. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అనే వివరాల్లోకి వెళితే…
‘కల్కి’ కోసం డీప్ ఫేక్ వాడారా ?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, అశ్వినీ దత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన మూవీ ‘కల్కి 2898’. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో అమితాబ్ – ప్రభాస్ మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా ఉంటుంది. కానీ అవన్నీ డూప్ అంటూ ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమాలో ఆ యాక్షన్స్ సీన్స్ లో నటించింది ప్రభాస్, అమితాబ్ కాదనే విషయం ఆ వీడియోను చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాడీ డబుల్స్, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడారని తెలుస్తోంది. అంతేకాకుండా డూప్ లకు అమితాబ్, ప్రభాస్ పేస్ లను రీప్లేస్ చేయడానికి వీఎఫ్ఎక్స్ కూడా వాడారని తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. అంటే ఈ సీన్స్ లో ప్రభాస్ కనీసం నటించలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
పెరుగుతున్న బాడీ డబుల్స్ ట్రెండ్
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోని చూశాక ప్రభాస్ కనీసం ఆ మూవీలో నటించకపోతే ఏం లాభం ? యాక్షన్ సీక్వెన్స్ లో అంటే డూప్ వాడవచ్చు. కానీ నటించడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కదా… అయినప్పటికీ డీప్ ఫేక్, వీఎఫ్ఎక్స్ వాడాల్సిన అవసరం ఏముంది? అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మాత్రమే కాదు చాలామంది హీరోలు ఇండస్ట్రీలో బాడీ డబుల్స్ ని వాడుతున్నారు అనే వాదన వినిపిస్తోంది. అంటే యాక్షన్స్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలలో హీరోని కాకుండా డూప్ ని వాడతారన్న మాట. ఇటీవల కాలంలో బాడీ డబుల్స్, డీప్ ఫేక్, వీఎఫ్ఎక్స్ కోసమే వందల కోట్లను ఖర్చు చేయడం వెనుక ఇదేనా కారణం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక వైరల్ వీడియో చూశాక “ఎంత మోసం చేశారురా!?” అని నోరు వెళ్ళబెడుతున్నారు.