BigTV English

Manipur : మణిపూర్ లో కీలక పరిణామం – సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పర్యటన

Manipur : మణిపూర్ లో కీలక పరిణామం – సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పర్యటన

Manipur : జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. అక్కడి క్షేత్రస్థాయిలోని పరిస్థితుల్ని పరిశీలించాలని, బాధితులకు అందుతున్న సహాయాన్ని పరిశీలించాలన్న డిమాండ్ల మధ్య ఈ పర్యటక ఆసక్తిగా మారింది. కుకీలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాట్లదారులు, స్థానికి హిందూ మైతేయి వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుండడంతో.. రాష్ట్రంలో అశాంతి నెలకొని, మణిపూర్ అస్తవ్యస్థంగా మారిపోయంది.


మణిపూర్ లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా అక్కడ నిరాశ్రయులైన వారికి అందుతున్న సహాయ, సహకారాలను పరిశీలించేందుకు.. వారి కోసం ఏర్పాటు చేస్తున్న న్యాయ, వైద్య శిబిరాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బృందం మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో పర్యటిస్తోంది. ఈ బృందానికి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వం వహిస్తుండగా మిగతా సభ్యులుగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ లు ఉన్నారు.

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి బలం అన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయి.. మణిపూర్ ప్రజలు ప్రస్తుతం క్లిష్ట సమయంలో ఉన్నారన్న విషయం తమకు తెలుసని.. రాష్ట్రంలోని ప్రజలంతా భారత రాజ్యాంగంపై నమ్మకం ఉంచాలని కోరారు. కేవలం రాజ్యాంగమే మణిపూర్ లో తిరిగి శాంతిని నెలకొల్పేందుకు ఉపకరిస్తుందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. మణిపూర్ కి త్వరలోనే మంచి రోజులు వస్తాయని, దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.


మణిపూర్ రాజధాని ఇంఫాల్ పర్యటనలో భాగంగా ఆదివారం నాడు.. స్థానికంగా నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచే మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్, ఇతర కోర్టు భవనాలు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. స్థానిక అధికారులతో, న్యాయమూర్తులతో సమావేశమైన సుప్రీంకోర్టు న్యాయాధికారులు అనేక విషయాలపై వారితో సంభాషించారు. ఆ తర్వాత నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ మణిపూర్ లోని అన్ని జిల్లాల్లో న్యాయ సేవ శిబిరాలు, వైద్య శిబిరాలను ప్రారంభించారు. తూర్పు ఇంఫాల్, పశ్చిమంలోని ఉఖ్రుల్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ సహాయ క్లినిక్లలను ప్రారంభించారు.

సుప్రీంకోర్టు తరపున తమ ప్రతినిధి బృందం ఇక్కడికి వచ్చిందని.. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయ సహకారాన్ని, న్యాయ ప్రయోజనాన్ని అందించేందుకే తమ ప్రయత్నమని బీఆర్ గవాయ్ తెలిపారు. అల్లర్ల కారణంగా నిరాశ్రయులుగా మారిన వారు న్యాయం పొందడంతో పాటు ఆరోగ్య సంరక్షణ పొందడం కూడా చాలా ముఖ్యమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అందుకోసం తాము నిలబడతామని, తాము సహాయం అందించేలా చేస్తామని భరోసా ఇచ్చారు. సమాజం కోసం, శాంతి కోసం కలిసి పని చేయడం అందరి బాధ్యత అని గుర్తు చేసిన సుప్రీం న్యాయమూర్తుల బృందం..  ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశం మొత్తం కలిసి పనిచేస్తుందని భరోసా ఇచ్చారు.

Also Read : IIT Guwahati : భారత్ సరిహద్దుల్లో ఏఐ రోబోల నిఘా – పాక్ చొరబాట్లకు చుక్కలే

మణిపూర్ ముఖ్యమంత్రిగా సేవలందించిన బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసిన ఐదు రోజుల తర్వాత.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. మణిపూర్లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ మణిపూర్ మే 3, 2023 న నిర్వహించిన ర్యాలీ తర్వాత… హిందూ మైయితేయి, క్రైస్తవుల కుకీ వర్గాల మధ్య తీవ్ర హింస చెలరేగింది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ… మొత్తం రాష్ట్రాన్ని హింసకాండగా మార్చేసింది. దాంతో.. అక్కడి పరిస్థితులు అదుపు చేసుకుందుకు కేంద్ర  ప్రభుత్వం ప్రత్యేక బలగాల్ని మోహరించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, సైన్యం చర్యలతో ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×