Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా.. లేడీస్ ఫేవరేట్ హీరోగా ఆయనకున్న ఇమేజ్ ను వేరే ఏ హీరో అందుకోలేదు. ఇక జనరేషన్ మారే కొద్దీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందని తెలుసుకున్న ఆయన హీరోగా సినిమాలు చేయకుండా విలన్ గా మారాడు. ఏ ముహూర్తానా.. జగ్గు భాయ్ లో బోయాపాటి శ్రీను విలనిజాన్ని చూసాడో.. ఆరోజే జగ్గూభాయ్ లైఫ్ మారిపోయింది.
లెజెండ్ సినిమాతో జగపతి బాబు తన విలనిజాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో అదరగొడుతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా జగపతి బాబు తన విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. జగ్గు భాయ్ లాంటి విలన్ ఇంకెవరు లేకపోవడంతో డైరెక్టర్స్ సైతం ఆయననే ఏరికోరి తీసుకుంటున్నారు.
Akkineni Naga Chaitanya: చై- శోభితా కొత్త కాపురం.. సామ్ ఇంట్లో.. ?
ఇక తాజాగా కన్నడలో ఆయన విలన్ గా నటించిన సినిమాకు ఐఫా అవార్డు దక్కింది. కన్నడ నటుడు దర్శన్ నటించిన చిత్రం కాటేరా. ఈ సినిమాలో జగపతి బాబు విలనిజాన్ని ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో ఈ అవార్డును ఆయనకు అందించారు. ఇక ఈ విషయాన్ని జగ్గూభాయ్ అభిమానులతో పంచుకున్నాడు. ఆయన సినిమాలు పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులకు, ముఖ్యంగా క్యాప్షన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
సాధారణంగా ఎంత వయస్సు వచ్చినా .. ఎవరు తమ వయస్సు పెరుగుతుంది అని చెప్పరు. కానీ, జగ్గూభాయ్ మాత్రం నిజాలు చెప్తూనే నవ్విస్తాడు. ముసలోడి జుట్టుకు రంగేసా.. కుర్రాడిలా కనిపించాలని ఎలా ఉంది.. ? అని, ఆరోగ్యం కాపాడుకోవడానికి నేను ఈ ఫుడ్ తింటున్నా.. అని .. ఇలా రకరకాల క్యాప్షన్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా ఐఫా అవార్డ్స్ ను అందుకుంటున్న వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నాడు జగ్గు భాయ్.
Bigg Boss 8 Day 51 Promo: నామినేషన్ వైలెన్స్.. పృథ్వీ దెబ్బకు అవినాష్ షాక్..!
ఇండియా నుంచి దుబాయ్ లో ఫ్లైట్ దిగడం, ఈవెంట్ కు రెడీ అవ్వడం, అవార్డును అందుకోవడం.. మళ్లీ తిరిగి వెళ్లడం మొత్తం చూపించాడు. ఇక ఈ వీడియోకు క్యాప్షన్ గా.. ” ఎంత ఎదవలా చేస్తే.. అన్ని అవార్డులు వస్తాయి.. హీహీ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇప్పుడున్న సమాజంలో మంచికన్నా చెడే ఎక్కువ చూస్తున్నారు అని కొందరు.. మీరు ఎలా ఉన్నా మేము చూస్తామని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం జగపతి బాబు కెరీర్ మూడు సపోర్టింగ్ రోల్స్ ఆరు విలన్ రోల్స్ అన్నట్లు ఉంది. వరుస సినిమాలతో ఆయన బిజీగా మారాడు.విజయాపజయాలను పట్టించుకోకుండా జగ్గు భాయ్ ఇండస్ట్రీలో రాకెట్ లా దూసుకెళ్తున్నాడు. మరి ముందు ముందు ఈ హీరో కమ్ విలన్ ఎలాంటి సినిమాలతో మెప్పిస్తాడో చూడాలి.
Yentha edhavalaaga chesthey Anni awardulu vasthayyi. He he….#IIFA2024 #Abudhabi pic.twitter.com/ecreMcgwCw
— Jaggu Bhai (@IamJagguBhai) October 22, 2024