Deviyani Sharma: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు తమకు నచ్చిన, తోచిన విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కష్టం వచ్చినా సరే.. అభిమానులతో చెప్పడానికి వెనుకడుగు వేయడం లేదు. ఒకరిని పొగడాలన్నా.. ఒకరిని విమర్శించాలన్నా.. సరే సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఒక అస్త్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ బ్యూటీ దేవియాని శర్మ (Deviyani sharma)చేసిన ఒక సుదీర్ఘ పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో తన నటనతో తక్కువ టైంలోనే మంచి పాపులారిటీ అందుకుంది. వైవిధ్యమైన ప్రాజెక్ట్ లతో పాటు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది.
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తో భారీ గుర్తింపు..
‘భానుమతి రామకృష్ణ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దేవియాని శర్మ మొదటి సినిమాతోనే అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోలేదు. కానీ తన అందచందాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలో కూడా కనిపించింది. ఇక ఇటీవల ‘సైతాన్’, ‘సేవ్ ద టైగర్స్’ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకుంది..ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
స్త్రీలను విమర్శించే పురుషులకు బహిరంగ లేఖ..
స్త్రీ విలువలను అర్థం చేసుకోని పురుషులకు బహిరంగ లేఖ అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది దేవియాని. “ఇప్పుడున్న రోజులలో ఎంతో మంది పురుషులు స్త్రీలను గౌరవించడంలో విఫలం అవుతున్నారు. ప్రేమ, మద్దతు, సమయం అన్నీ ఇచ్చే వ్యక్తిని కేవలం ప్రేక్షకురాలిగా ఎందుకు పరిగణిస్తారు? పురుషులు స్త్రీలను ఎందుకు వెంబడిస్తారు? వారు కోరుకున్నది మహిళల నుంచి పొందే వరకు మాత్రమేనా? వారు సంతృప్తిని పొందే వరకేనా..? వారు దానిని సంపాదించిన తర్వాత ఆసక్తి తగ్గిపోతుందా? అయితే కొంతమంది పురుషులు మాటల్లోనే కాకుండా తమ చర్యల ద్వారా కూడా విధేయతను చూపడం ఎందుకు కష్టపడుతున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించింది దేవియాని శర్మ.
ప్రేమ పేరుతో ఆడుకోవడం హాస్యాస్పదం..
పెళ్లి జరిగినా, పెళ్లి జరగకపోయినా ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పరం గౌరవం లేకపోవడం, నిరంతరం నిందలు వేయడం, ఒక భాగస్వామి తమను విడిచిపెట్టినట్లు భావించడం , విడాకులు కోరడం వంటి పరిస్థితిలో ఉన్న వారిని చూస్తే మాత్రం మరింత బాధ వేస్తుంది. కొంతమంది పురుషులు అహంకారం కారణంగా స్త్రీలపై పై చేయి సాధించామని నమ్ముతారు. పురుషులు ప్రేమించే శక్తి కలిగి ఉంటారు. కానీ అగౌరవం ఆమోదయోగ్యం కాదు కదా.. ఇతరుల భావోద్వేగాలు, మానసిక భద్రతతో ఎందుకు ఆడుకుంటారు. ప్రేమ పేరుతో భావోద్వేగాలతో ఆడవారిని తక్కువ చేసి ఆడుకోవడం హాస్యాస్పదంగా ఉంది” అంటూ రాసుకుంది ఇక ఇంత సుదీర్ఘ పోస్టు షేర్ చేసింది అంటే తన మనసులో ఏదో బాధ ఉందని, ఈ కారణంగానే ఇంత పెద్ద కొటేషన్ దేవియాని షేర్ చేసింది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు . మరి ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ రూమర్స్ కి కాస్త చోటు ఇచ్చిందని చెప్పవచ్చు.