BigTV English

VD Kingdom : కింగ్ డమ్ కాదు.. కింగ్ ఆఫ్ డమ్మి..

VD Kingdom : కింగ్ డమ్ కాదు.. కింగ్ ఆఫ్ డమ్మి..

VD Kingdom : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది చివరగా ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. గత రెండేళ్లుగా విజయ్ అకౌంట్ లో హిట్ మూవీ పడలేదు. అయితే ప్రస్తుతం ‘కింగ్ డమ్’ మూవీతో హిట్ కొడతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నుండి చాలా వరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో మూవీ జూలై 4 న రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. దాంతో ఈ మూవీ పై నెట్టింట ఓ చర్చ నడుస్తుంది.. అదేంటో ఒకసారి చూసేయ్యండి..


కింగ్ డమ్ ప్రమోషన్స్ ఆలస్యమా..? 

ఒకప్పుడు విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది అంటే యూత్ హంగామా ఓ రేంజ్ లో ఉండేది. కానీ ఈ మధ్య అలాంటి జోరు ఆయన అభిమానుల్లో కనిపించలేదు. అందుకు కారణం విజయ్ అకౌంట్ లో హిట్ మూవీ లేకపోవడమే.. గీతాగోవిందం తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాలు ఒక్కటి కూడా లేదు. ఇక గత రెండేళ్లుగా ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఏమో కింగ్ డమ్ మూవీతో రాబోతున్నాడు. రిలీజ్ అవ్వడానికి నెల ఉండంతో ప్రమోషన్స్ మొదలు పెడితే సినిమాపై జనాల్లో హైప్ క్రియేట్ అవుతుంది. కానీ మేకర్స్ మౌనంగా ఉండటం పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ లైగర్ ఎఫెక్ట్ ఈ మూవీ పై ఉందని ఇండస్ట్రీలో టాక్..


లైగర్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదా..? 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం లైగర్.. ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీ నష్టాన్ని భర్తీ చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ గొడవ ఓ కొలిక్కి రాలేదు.. కానీ దీని ఎఫెక్ట్ మాత్రం విజయ్ సినిమాల పై పడుతుంది…

గౌతమ్ తిన్ననూరి స్లో నారేషన్ మరో కారణమా..? 

జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి సినిమాలు అన్ని స్లో నారేషన్ తో ఉంటాయి. ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు అది సెట్ అవ్వదు. ఇది ఒక కారణం.. ఈ మూవీ పై విజయ్ ఫ్యాన్స్ కు హోప్స్ ను తగ్గిస్తుంది.. దీంతో కింగ్ డం ఇండస్ట్రీలో బజ్ ఏం లేదు. గౌతమ్ తిన్ననూని స్లో నారేషన్ ఈ సినిమాకు సెట్ అవ్వకపోవచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్..  దీంతో కింగ్ డమ్ మూవీ కిండ్ ఆఫ్ డమ్మి అనేలా మూవీ ఉంటుంది అనేది టాక్ ఇప్పుడు.. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సో.. సో గానే అనిపిస్తున్నాయి. మరి చివరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×