Sobhan Babu: శోభన్ బాబు .. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తమ నటనతో అభిమానులను అలరిస్తున్న సమయంలో శోభన్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. వారు ముగ్గురు కాకుండా ప్రేక్షకులు ఏ హీరోను కూడా ఆదరించరు అనుకున్న సమయంలో శోభన్ బాబు తన అందం, నటనతో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ముఖ్యంగా సోగ్గాడు సినిమాతో ఆయన కెరీర్ మొత్తం మారిపోయింది. శోభన్ బాబు కాస్త సోగ్గాడిగా మారిపోయాడు.
రింగుల జుట్టు.. నుదిటిపై ఒక ఫంక్ తో ఆయ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఎవరైనా ఆ ఫంక్ తో కనిపిస్తే శోభన్ బాబు వచ్చాడురోయ్ అని అంటూ ఉంటారు. ఇక చాలామంది సీనియర్ హీరోలు.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఇది ఇప్పుడే వచ్చిన కొత్త అలవాటు కాదు. అప్పట్లో ఏఎన్నార్, కృష్ణ, ఎన్టీఆర్ సైతం హీరో నుంచి కీ రోల్స్ లో నటిస్తూ వచ్చినవారే. కానీ, ఒక్క శోభన్ బాబు మాత్రం హీరోగా చేశాడు.. హీరోగానే మరణించాడు.
200 కు పైగా సినిమాలల్లో నటించిన శోభన్ బాబు 1996 లో తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. చాలామంది దర్శకులు.. శోభన్ బాబును సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయమని అడిగారట. కానీ,దానికి ఆయన నో చెప్పారట. తాను ప్రేక్షకుల హృదయాల్లో హీరోగానే గుర్తు ఉండాలని చెప్పేవాడట. అంతేకాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోలకు తండ్రిగా, మామగా చేయాలంటే.. తన వయస్సు ఇంకా పెద్దదిగా చెప్పాలి. అది ఆయనకు ఇష్టం ఉండేది కాదట. అందుకే హీరోగానే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు చెప్పారట.
ఇక శోభన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్నో మంచి పాత్రలు వచ్చాయి. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందులో సుమన్ వేంకటేశ్వరస్వామి పాత్రలో నటించారు అని చెప్పడం కన్నాజీవించారు అని చెప్పాలి. ఇక ఆ పాత్రకు సుమన్ కన్నా ముందు శోభన్ బాబునే సంప్రదించారట. ఇక ఆ పాత్రను ఆయన సున్నితంగా తిరస్కరించారట.
పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించిన సుస్వాగతం సినిమాను మర్చిపోవడం జరగని పని. అందులో పవన్ తండ్రిగా రఘువరన్ నటించాడు. తండ్రీకొడుకుల బంధం అంటే ఇలా ఉండాలని అప్పట్లో ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. రఘువరన్ చనిపోయే సీన్ లో ప్రేక్షకులు సైతం కంటతడి పెట్టారు. అలాంటి అద్భుతమైన పాత్ర ముందు శోభన్ బాబు వద్దకే వెళ్లిందట. కానీ, ఆయన ఈ ఛాన్స్ ను కూడా వద్దని వదులుకున్నారు.
Nari Nari Naduma Murari: బాలయ్య టైటిల్ పెట్టుకున్నంత ఈజీ కాదు శర్వా.. ఆయనలా హిట్ కొట్టడం
ఇక ఈ రెండు కాకుండా మరో అద్భుతమైన పాత్రను కూడా శోభన్ బాబు తిరస్కరించాడు. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమాలో నాజర్ పాత్రకు ముందు శోభన్ బాబును సంప్రదించడం జరిగింది. ఆ సినిమా నిర్మాత అయిన మురళీ మోహన్.. శోభన్ బాబు వద్దకు వెళ్లి ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చి ఆ పాత్ర చేయమని అడిగినా కూడా శోభన్ బాబు నో అన్నాడు. ఆ తరువాత మహేష్ తాత సత్యనారాయణ మూర్తి పాత్రలో నాజర్ ను తీసుకున్నారు.
ప్రత్యేక పాత్రలు కాకుండా కేవలం హీరోగానే చేయించాలని ఆర్. బి చౌదరి ప్రయత్నించారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన బ్లాక్ సినిమాను తెలుగులో శోభన్ బాబు హీరోగా రీమేక్ చేయాలనీ అనుకున్నారు. కానీ, హీరోగా కూడా శోభన్ బాబు నో చెప్పారట. అలా ఇన్ని హిట్ సినిమాలను శోభన్ బాబు నో చెప్పాడు. కేవలం హీరోగానే ప్రేక్షకుల మనస్సులో పదిలంగా ఉండడం కోసం ఇన్ని హిట్ సినిమాలను వదులుకున్నాడా అని అభిమానులు నోర్లు వెళ్లబెడుతున్నారు.