BigTV English

Heroines Education Details: అందంలోనే కాదు మన హీరోయిన్స్ చదువులో కూడా తోపే.. ఎవరి క్వాలిఫికేషన్ ఎంతంటే?

Heroines Education Details: అందంలోనే కాదు మన హీరోయిన్స్ చదువులో కూడా తోపే.. ఎవరి క్వాలిఫికేషన్ ఎంతంటే?

Heroines Education Details:చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ అందం , అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మలు కేవలం సినిమాల్లోనే కాదు చదువుల్లోనూ టాప్ గానే ఉన్నారు.మరి తెరపై మనల్ని తమ నటనతో అలరించే ఈ ముద్దుగుమ్మలు. ఏమేం చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.


సమంత (Samantha):

తన యాక్టింగ్ తో ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న సమంత (Samantha).. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B. Com) చేసింది.


తమన్నా భాటియా (Tamannaah Bhatia):

పాలమీగడ లాంటి మేని ఛాయతో సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా (Tamannaah Bhatia) సినిమాల్లోనే కాదు చదువులో కూడా బెస్ట్.. ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) పూర్తి చేసింది.

అనుష్క శెట్టి (Anushka Shetty):

జేజమ్మగా తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న అనుష్క శెట్టి (Anushka Shetty) బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (BCA) పూర్తి చేసింది.

కాజల్ అగర్వాల్ (Kajal Agarwal):

చందమామగా టాలీవుడ్ ని ఫిదా చేసిన కాజల్ అగర్వాల్(Kajal Agerwal) బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా ఇన్ అడ్వటైజింగ్ అండ్ మార్కెటింగ్(BMM) కంప్లీట్ చేసింది.

జెనీలియా (Genelia):

హహహ హాసిని అంటూ బొమ్మరిల్లు (Bommarillu)మూవీ ద్వారా పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న జెనీలియా (Genelia).. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(BMS) పూర్తి చేసింది.

నయనతార (Nayanthara):

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా సినిమాలతో క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతార (Nayanthara) BA ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసింది.

త్రిష కృష్ణన్ (Trisha Krishnan):

వర్షం సినిమా (Varsham Movie)తో టాలీవుడ్ యూత్ ని ఆకట్టుకున్న త్రిష(Trisha) బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) కంప్లీట్ చేసి సినిమాల్లోకి వచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh):

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) బీఎస్సీ మ్యాథమెటిక్స్ (BSC Mathematics) కంప్లీట్ చేసింది.

రష్మిక మందన్న (Rashmika mandanna):

పాన్ ఇండియా హీరోయిన్ గా.. నేషనల్ క్రష్ గా సౌత్, నార్త్ లో అదరగొడుతున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసి అలాగే జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది.

పూజా హెగ్డే (Pooja Hegde):

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే(Pooja Hegde) ఎంకామ్(M.Com) పూర్తి చేసింది.

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran):

మత్తు కళ్ళ సుందరి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) బిఎ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ పూర్తి చేసింది.

నిత్యామీనన్ (Nithya Menon):

ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోనే అందర్నీ ఆకట్టుకునే నిత్యమీనన్(Nithya Menon) జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది.

సాయి పల్లవి (Sai Pallavi):

లేడీ పవర్ స్టార్ గా తన సహజ నటనతో అందర్నీ ఆకట్టుకున్న సాయి పల్లవి(Sai Pallavi) ఎంబిబిఎస్(MBBS) కంప్లీట్ చేసింది.

కీర్తి సురేష్ (Keerthy Suresh):

మహానటి (Mahanati) మూవీతో సావిత్రి (Savitri) బయోపిక్ లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన కీర్తి సురేష్ (Keerthy Suresh) బిఎ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది.

శృతిహాసన్ (Shruti haasan):

తండ్రి స్టార్డంని వినియోగించుకోకుండా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతిహాసన్ (Shruti Haasan)బీఎస్సీ సైకాలజీ పూర్తి చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×