OTT Movie : ఓటీటీలోకి ఒక ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో ఆర్కిటెక్ట్ అయిన హీరో, బతుకు దెరువు కోసం అమెరికాకి వలస వస్తాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సినిమాకి మూడు కేటగిరీ లో ఆస్కార్ అవార్డులు వచ్చాయి, అంతే కాకుండా మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను కూడా దక్కించుకుంది. ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
‘ది బ్రూటలిస్ట్’ సినిమా కథ ఒక హంగేరియన్-జ్యూయిష్ ఆర్కిటెక్ట్ అయిన లాస్లో టోత్ అనే వ్యక్తి జీవితం చుట్టూ తిరుగుతుంది. 1947లో, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, హోలోకాస్ట్ నుండి బయటపడిన లాస్లో, అమెరికాలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వస్తాడు. అతని భార్య ఎర్జ్‌సెబెట్ (ఫెలిసిటీ జోన్స్) మేనకోడలు జ్సోఫియా (రాఫీ కాసిడీ) యుద్ధం కారణంగా ఆస్ట్రియా సరిహద్దులో చిక్కుకుంటారు. అమెరికాలో, లాస్లో తన బంధువు అట్టిలా (అలెస్సాండ్రో నివోలా) వద్ద ఫిలడెల్ఫియాలో ఆశ్రయం పొందుతాడు. అతను ఒక ఫర్నిచర్ దుకాణం నడుపుతూ అమెరికన్ సంస్కృతిలో కలిసిపోతాడు. లాస్లో, తన ప్రతిభను నిరూపించుకునేందుకు, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త హారిసన్ లీ వాన్ బ్యూరెన్ (గై పియర్స్) దృష్టిని లో పడటానికి ప్రయత్నిస్తాడు.
హారిసన్, లాస్లో ప్రతిభను గుర్తించి, అతనికి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను అప్పగిస్తాడు. అయితే, ఈ అవకాశం లాస్లోకు విజయాన్ని అందించినప్పటికీ, హారిసన్ నియంత్రణ, దురాశతో కూడిన వైఖరి అతని జీవితంలో సవాళ్లను తెచ్చిపెడుతుంది. కథలో లాస్లో తన కళాత్మక దృష్టిని కాపాడుకోవడానికి, తన గత బాధలను ఎదుర్కోవడానికి చాలా సమస్యలను ఎదుర్కుంటాడు. చివరికి లాస్లో తన భార్య, మేనకోడలిని కలుస్తాడా ? లాస్లో జీవితం ఎటు వెళ్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా బ్రూటలిస్ట్ ఆర్కిటెక్చర్ కఠినమైన, బలమైన శైలిని ప్రతిబింబిస్తూ, ఇమ్మిగ్రేషన్, గుర్తింపు, కళ మీద ఆధిపత్యం గురించి లోతైన విషయాలను అందిస్తుంది. 3 గంటల 35 నిమిషాల నిడివితో, ఇది అడ్రియన్ బ్రోడీ నటనతో ఒక భావోద్వేగ అనుభవం కలిగిస్తూ ఆకట్టుకుంటుంది.
Read Also : తల్లిని ఇంటరాగేషన్ చేసే కొడుకులు … ముసుగు వెనుక గందరగోళం .. ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్
ఈ హిస్టారికల్ మూవీ పేరు ‘ది బ్రూటలిస్ట్’ (The Brutalist). 2024 లో వచ్చిన ఈ సినిమకి బ్రాడీ కార్బెట్ దర్శకత్వం వహించారు. ఇది మోనా ఫాస్ట్‌వోల్డ్‌తో కలిసి రాసిన ఒక ఎపిక్ పీరియడ్ డ్రామా. ఇందులో అడ్రియన్ బ్రోడీ,ఫెలిసిటీ జోన్స్, గై పియర్స్,జో ఆల్విన్, రాఫీ కాసిడీ ప్రధాన పాత్రల్లో నటించారు. 3 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.3/10 రేటింగ్ ఉంది. ఈ మూవీ 10 ఆస్కార్ నామినేషన్లతో, బెస్ట్ సినిమాటోగ్రఫీ, స్కోర్, లీడ్ యాక్టర్ అవార్డులను సొంతం చేసుకుంది. అంతే కాకుండా గోల్డెన్ గ్లోబ్స్‌లో 3 అవార్డులు గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో రెంట్ కి అందుబాటులో ఉంది. ఈ నెల 28 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.