Illu Illalu Pillalu Today Episode April 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి ఆగిపోవద్దని చందు డబ్బుల కోసం తన ఫ్రెండ్స్ అందరిని అడుగుతుంటాడు. ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని దూరం చేయొద్దని ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని తనలో తానే మధుర పడుతూ ఉంటాడు. డబ్బుల కోసం ఫ్రెండ్స్ అందరినీ ఒక్కొక్కరుగా అడుగుతుంటాడు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవని సమాధానం రావడంతో ఫీల్ అవుతాడు. ఇక వెనకనుంచి రామరాజు చందు భుజంపై చేయి వేస్తారు. అది చూస్తున్న చందు షాక్ అవుతాడు. రామరాజు కు నిజం చెప్పడు.. నర్మదా కోరికను వేదవతి తీరుస్తుంది. కోడలి ఆనందాన్ని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తల్లిని చూసి.. నర్మద పరుగు పరుగున వెళ్తుంది. గుండెలకు హత్తుకుని భోరున ఏడుస్తుంది. అమ్మ నువ్వు నా కోసం వచ్చావా? నాకు ఇదంతా కలగా ఉంది.. నీ అంతట నువ్వే నా కోసం వచ్చావా? అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది నర్మద. ఆ మాటతో నర్మద తల్లి మీ అత్తయ్య రమ్మని చెప్పింది అని అంటుంది. పెళ్లికి మీ నాన్న తో కలిసి వస్తానని అంటుంది. ఆ సీన్ చూసి ప్రేమ వాళ్ళమ్మ కూడా ఆలోచిస్తుంది. నేను కూడా నా కూతురు దగ్గరికి ఇలానే వెళ్తే ఎంత బాగుంటుందో అని సంతోషపడుతుంది.. పాతకేళ్లు పెంచిన నా కూతురి మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లూ నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అయ్యేట్టు చెప్పారు. నా కూతుర్ని నాకు కొత్తగా పరిచయం చేశారు. ఈ తల్లి మనసు కన్న కూతురు కోసం పరుగుపెట్టుకుని వచ్చేలా చేశారు అని అంటుంది.
చందు డబ్బుల కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే డబ్బులు కోసం తనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు అడిగినా డబ్బులు లేవని చెప్తారు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే శ్రీవల్లికి చెప్పాలని శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. నేను చాలా ట్రై చేశాను కానీ డబ్బులు కుదరట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే శ్రీవల్లి అదేంటి బా అలా అంత మాట అనేసావ్ ఇప్పుడు పెళ్లి డేట్ దగ్గర పడింది కదా ఈ టైంలో నువ్వు ఇలా అంటే ఎలా అనేసి శ్రీవల్లి టెన్షన్ పడుతుంది.
అయినా మీ నాన్నది ఫైనాన్స్ బిజినెస్ కదా మీ నాన్న ఎవరో ఒకరిని ట్రై చేయమని చెప్పు అని శ్రీవల్లికి పెద్ద షాక్ ఇస్తాడు చందు. ఇక నర్మదా తన తల్లి ఇచ్చిన నగలను పెట్టుకొని ప్రేమని ఎలా ఉందని అడుగుతుంది. మా అమ్మ వాళ్ళు ఎలాగైతే అర్థం చేసుకున్నారో మీ అమ్మ వాళ్లు కూడా అలాగే అర్థం చేసుకుంటారులే ప్రేమ బాధపడకు అని నర్మదా అంటుంది. ఇక పొద్దున చేసిన పిండి వంటలు అన్నిటిని నర్మదా ప్రేమ ఇద్దరు సర్ది పెడతారు.
సాగరు ప్రేమతో మాట్లాడకుండా అసలు ఉండలేకపోతున్నాను ఎలాగైనా నా పెళ్ళాంతో మాట్లాడాలని సైగలు చేస్తాడు. బుక్ లోని ఒక పేపర్ ని చించి ఐ లవ్ యు అని రాసి నర్మదకు విసురుతాడు.. ఇక అప్పుడే వాళ్ళ అక్క అక్కడికి వచ్చి నీ పెళ్ళానికి సైగలు చేస్తున్నావ్ ఆడపడుచు కట్టం మాత్రం నీకు ఇవ్వడం తెలియదా అనేసి అంటుంది. ప్రేమ బాక్స్లన్నీ సర్దుతూ ఉంటుంది ఆ పేపర్ ని చూసి అక్కడే ఉన్న ధీరజ్ ని అడుగుతుంది. మొహానికి ప్రేమించే అంత సీన్ లేదు నువ్వు అంత ఫీల్ అవ్వకు అని ధీరజ్ అంటాడు.
ఇక నర్మదా వాళ్ళ అమ్మ ఇచ్చిన నగలను చూసుకుంటూ మీరు నాతో ఉన్నట్లు చాలా సంతోషంగా ఉందని మురిసిపోతూ ఉంటారు. ప్రేమ వాళ్ళ అమ్మ ఎందుకు బాధ పడుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మ మాత్రం తన కూతురికి ఎలాగైనా నగలు ఇవ్వాలని ఆ నగలు అన్నిటినీ తీస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన శారదాంబ ఈ నగలు ఎవరికోసం తీసుకెళ్తున్నావంటే నా కూతురు కోసం అత్తయ్య అని అంటుంది.
నీ కూతురు తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని నువ్వు కూడా కోపంగా ఉన్నావని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని శారదాంబా అంటుంది. భద్ర వాళ్ళు చూస్తారేమో జాగ్రత్తగా వెళ్ళు అని పంపిస్తుంది. ప్రేమ వాళ్ళమ్మ నగలను తీసుకొని రామరాజు ఇంటికి వస్తుంది ప్రేమ అని పిలుస్తుంది వాళ్ళ అమ్మని చూసి ప్రేమ చాలా సంతోషపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో చందు సేటు దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని అడుగుతాడు అప్పుడే రామరాజు కూడా అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.