Vivek Oberoi.. సాధారణంగా ఏ హీరోకైనా సరే ఒక సినిమాతో మంచి విజయం లభించిందంటే, వరుసగా ఆఫర్లు తలుపు తడతాయి. కానీ మరి కొంతమందికి వరుస డిజాస్టర్లు తలుపు తట్టినా సరే ఆఫర్లు వచ్చి పడతాయి. ఇంకొంతమంది స్టార్ హీరోలుగా, సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న వారి ఆస్తులను సైతం వెనక్కి నెట్టి ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటులుగా చలామణి అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్(Vivek Oberoi)కూడా ఒకరు.. అడపాదడపా మాత్రమే వెండితెరపై కనిపిస్తారు. ఈయన ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు అని చెప్పాలి. కానీ ఆయన ఆస్తులు విలువ తెలిస్తే మాత్రం రజనీకాంత్ (Rajinikanth ), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వంటి స్టార్ హీరోల ఆస్తుల కంటే కూడా మూడు రెట్లు అధికం.
‘రోల్స్ రాయిస్ కల్లినన్’ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన వివేక్..
దీంతో ఈయన ఎలా సంపాదిస్తారు..? అసలు ఈయన ఆస్తి విలువ ఎంత ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేక్ ఒబెరాయ్ ఆస్తులు విలువ రూ.1200 కోట్ల పైమాటే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన ఖరీదైన వాహనాలలో ఒకటైన “రోల్స్ రాయిస్ కల్లినన్” ను కొనుగోలు చేసి మీడియా హెడ్లైన్స్ లో నిలిచారు. దీని ధర సుమారు రూ.12 కోట్లు.. సినిమాలు లేకపోయినా అతడికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు. వాస్తవానికి వివేక్ సినిమాల ద్వారానే కాకుండా పలు వ్యాపారాలు చేస్తూ కూడా బాగా ఆర్జించినట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ తో గొడవ.. ఇండస్ట్రీ నుండి బహిష్కరణ..
గత రెండు దశాబ్దాలుగా నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం గురించి కేవలం కొంతమందికి మాత్రమే తెలుసట.
ఇక 2002లో ‘కంపెనీ’ అనే బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన, ఆ తర్వాత సాథియా మస్తీ, ఓంకార వంటి సినిమాలు ఆయనను స్టార్ గా అందలం ఎక్కించాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఆయన విజయాన్ని కప్పివేసింది. ముఖ్యంగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్(Aishwarya Rai)తో ప్రేమాయణం కారణంగా సల్మాన్ ఖాన్ (Salman Khan) తో బహిరంగంగా గొడవపడ్డారట. దాంతో ఆయన కెరియర్ కాస్త మలుపు తిరిగింది. కాలక్రమేనా వివేక్ కు అవకాశాలు రాకుండా పోయాయి. దీనికి తోడు ఆయన నటించిన సినిమాలు కూడా డిజాస్టర్ అవడంతో ఇక ఆయనను బహిష్కరించారు అనే వార్తలు కూడా వినిపించాయి.
వేల కోట్లకు అధిపతి..
ఇక దాంతో సౌత్ లో నటించడం మొదలుపెట్టారు వివేక్ ఒబేరాయ్. అలా తెలుగులో ‘రక్త చరిత్ర’, మలయాళంలో ‘లూసీఫర్’ వంటి సినిమాలు చేసి ఒక మోస్తారు గుర్తింపు తెచ్చుకున్న ఈయన ‘ఇన్సైడ్ ఎడ్జ్’ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి వివేక్ ఒబేరాయ్ మంచి మేధావి. స్వతహాగా బిజినెస్ మాన్ కూడా.. నటుడు కాకముందే డబ్బును ఎలా పదింతలు చేయాలో తెలిసిన నిబద్ధత కలిగిన వ్యాపారి. అందుకే నిశ్శబ్దంగా ఆర్థిక సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దాడు. అదే ఇప్పుడు ఆయనను భారతదేశంలో అత్యంత సంపన్న నటులలో ఒకరిగా నిలబెట్టింది. ముఖ్యంగా ఆయన వ్యూహాత్మక పెట్టుబడులు వ్యవస్థాపక వెంచర్ల ఫలితమే ఇంతటి సామ్రాజ్యం అని చెప్పవచ్చు. యూఏఈ లోని రస్ అల్ ఖైమా లోని అల్ మార్టన్ ద్వీపంలో రూ.2,300 కోట్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయినా ఆక్వా ఆర్క్ వ్యవస్థాపకుడు కూడా.. అంతేకాదు విద్యా ఆవిష్కరణలపై దృష్టి సారించే స్వర్నిమ్ విశ్వవిద్యాలయానికి సహా వ్యవస్థాపకుడు కూడా. నటన రంగం కంటే వ్యాపార రంగంలోనే ఆయన భారీగా సంపాదించినట్లు సమాచారం.