Bommarillu Bhaskar: సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న జాక్ మూవీ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
హీరోయిన్ పై డైరెక్టర్ కామెంట్స్..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో గ్లామర్ పాత్ర కోసమే పూజా హెగ్డే ని తీసుకున్నారు. మరి ఈ మూవీలో వైష్ణవిని హీరోయిన్ గా తీసుకోవడంపై భాస్కర్ మాట్లాడుతూ ” కథ స్ట్రాంగ్ గా ఉంది. ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా విజువల్స్ చాలా బాగ వచ్చాయి .పెద్ద సినిమా కాబట్టి దానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ హీరోయిన్ అందిస్తుందనే ఈ సినిమాకి హీరోయిన్ గా వైష్ణవి ని తీసుకున్నాము. ఈ సినిమా ఫ్రెష్ కథగా వస్తుంది. బోర్ కొట్టడానికి తావు లేకుండా చాలా ఫన్నీ గా సినిమాను తీశాము. నేను నమ్మే విధానం ఎంటర్టైన్మెంట్ తో ఫన్నీగా చెప్పాలి. సరదాగా ఏ విషయం అయినా అడియన్స్ లోకి తీసుకెళ్లాలి అన్నది నా ఉద్దేశం. నా సినిమాలో మెసేజ్ లాంటివి ప్రత్యేకంగా ఏమీ చెప్పను. నేను మన మధ్యలో ఉన్నటువంటి ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక విషయాన్ని తీసుకొని, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే పద్ధతి ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. నేను కూడా ఈ కథలో అదే చెప్పడానికి ట్రై చేశాను. హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో, క్యారెక్టర్స్ అన్నిటికీ డెప్త్ ఉండేలాగా కథని రాసుకున్నాను . హీరోయిన్ రోల్ కూడా అలానే రాశాను. లైట్ గా ఎంటర్టైనర్ గా ఉంటుంది. ఈ సినిమా మీరు చూస్తే అదే అంటారు. బడ్జెట్ కోసం హీరోయిన్ ని మార్చాను అన్నది కాదు. ఈ సినిమాకి ఈ హీరోయిన్ అయితేనే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరని తీసుకున్నాను. సిద్దు జొన్నలగడ్డ ఎంత యాక్టివ్ గా చేస్తారో హీరోయిన్ కూడా అంతే బాగా చేశారు. మంచి రోల్ లో వైష్ణవి నటించారు. సినిమా ప్రతి ఒక్కరూ నవ్వుకునే విధంగా ఆడియన్స్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. సినిమాను చూసి మీరే చెప్తారు” అని భాస్కర్ మాట్లాడారు.
సినిమా గురించి డైరెక్టర్ మాటలు..
టిల్లు ,టిల్లు స్క్వేర్ సినిమాలతో వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటున్న హీరో సిద్దు జొన్నలగడ్డ మరో డిఫరెంట్ మూవీ జాక్ తో ఈ నెల 10వ తేదీన జాక్ సినిమాతో మన ముందుకు రానున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ రోల్లో స్పైగా డిఫరెంట్ లుక్ తో హీరో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ పాజిటివ్ టాక్ ని క్రియేట్ చేశాయి. బేబీ సినిమాతో తన నటన మరో స్థాయికి తీసుకువెళ్లిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలో గ్లామరస్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమాలో హీరోకి, హీరోయిన్ కి ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఎక్కువ అని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి..