Buttermilk: వేసవి కాలం వచ్చిన వెంటనే.. ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవడం అవసరం అవుతుంది. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించినా జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారికి ఈ సీజన్‌లో మలబద్ధకం, గ్యాస్ , అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను అధిగమించడానికి.. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
మజ్జిగలో కాల్షియం, ప్రోబయోటిక్స్, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మూలవ్యాధి వంటి తీవ్రమైన సమస్యలు కూడా మజ్జిగ తాగడం వల్ల తగ్గుతాయి. ఆయుర్వేదంలో కూడా.. మజ్జిగ శరీరానికి చాలా మేలు చేస్తుందిని చెప్పబడింది.
మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థ: కడుపు సంబంధిత సమస్యలలో ప్రధాన సమస్యలలో ఒకటి జీర్ణవ్యవస్థలో వాపు. క్రమం తప్పకుండా మజ్జిగ తాగడం వల్ల ఈ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులోని వేడిని చల్లబరచడంలో మజ్జిగ కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఎముకల ఆరోగ్యం: శరీర నిర్మాణం సరిగ్గా పనిచేయాలంటే ఎముకలు బలంగా ఉండాలి. మజ్జిగలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైన కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన ఎముకల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
రోగనిరోధక వ్యవస్థ: మజ్జిగలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పనిచేస్తాయి. రోగనిరోధక శక్తి బాగా ఉండటం వల్ల.. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నాడీ వ్యవస్థ: మజ్జిగలో విటమిన్ B12 కూడా ఉంటుంది. ఇది మన నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మజ్జిగ తాగడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మజ్జిగ శరీరాన్ని రిఫ్రెష్ చేసి శక్తితో నింపుతుంది. నాడీ సంబంధిత సమస్యలు రాకుండా కూడా ఉపయోగపడుతుంది.
ఏది ఎక్కువ ప్రయోజనకరం- పెరుగు లేదా మజ్జిగ ?
పెరుగు, మజ్జిగ గురించి మాట్లాడుకుంటే.. రెండూ పాల ఉత్పత్తుల్లో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి. పెరుగు కొంచెం చిక్కగా ఉంటుంది. అందుకే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మజ్జిగ విషయానికి వస్తే.. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా దీనిని తాగడం వల్ల కడుపుకు చల్లదనం కూడా లభిస్తుంది.
Also Read: చిటికెడు ఉప్పు కలిపిన నీళ్లు తాగితే.. ఇన్ని ప్రయోజనాలా ?
జీర్ణక్రియ పరంగా పెరుగు కంటే మజ్జిగ బాగా పనిచేస్తుంది. పెరుగులో లభించే అన్ని ఖనిజాలు , విటమిన్లు మజ్జిగలో ఉంటాయి. ఇందులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగ పలుచగా ఉండటం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.