Director Maruthi: చిన్న బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులు, యంగ్ డైరెక్టర్స్.. ఇలాంటి వారికి ఒక్క అవకాశం ఇవ్వడానికి స్టార్ హీరోలు ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఒకప్పుడు స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోలు.. కేవలం స్టార్ డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్‌తోనే పనిచేయడానికి ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. రోజులు పూర్తిగా మారిపోయాయి. ఒక డైరెక్టర్‌లో టాలెంట్ ఉందని తెలిస్తే చాలు.. వారిపై నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తున్నారు హీరోలు. అలాగే ‘రాజా సాబ్’తో మారుతికి అవకాశం ఇచ్చాడు ప్రభాస్. అదే విధంగా ‘రాజా సాబ్’ తర్వాత మరొక స్టార్ హీరో మారుతి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
మరో స్టార్
మారుతితో ప్రభాస్ (Prabhas) సినిమా అనగానే ప్రేక్షకులంతా షాకయ్యారు. ఇప్పటివరకు మారుతి.. ఒక్క స్టార్ హీరోను కూడా హ్యాండిల్ చేయలేదు. పైగా తను తెరకెక్కించినవి అన్నీ చిన్న బడ్జెట్ సినిమాలే. దీంతో ప్రభాస్ లాంటి స్టార్ హీరోను మారుతి హ్యాండిల్ చేయగలడా, పైగా తనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే కథతో సినిమా తీయగలడా.. ఇలా ఎన్నో అనుమానాలు వినిపించాయి. కానీ మారుతి మాత్రం ప్రభాస్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాను తెరకెక్కిస్తున్నానని మాటిచ్చాడు. అదే విధంగా ఇప్పుడు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసే మరొక రూమర్ బయటికొచ్చింది. ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ పూర్తయిన తర్వాత అల్లు హీరోను డైరెక్ట్ చేయనున్నాడట మారుతి.
Also Read: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. ఆ వారసుడి కెరీర్‌ను కాపాడుతుందా.?
ఎవరైనా ఓకే
అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి మారుతి (Maruthi) సన్నాహాలు మొదలుపెట్టాడని టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను బన్నీ కోసం సిద్ధం చేస్తున్నాడట మారుతి. ప్రస్తుతం ఈ కథ ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి దీనిని అల్లు అర్జున్‌కు వినిపించాలి, ఈ కథకు తనను ఒప్పించాలి.. ఇలా ఇంకా చాలా పనులు ఉన్నాయి. కానీ ఒకవేళ బన్నీ ఈ మూవీని ఒప్పుకుంటే మారుతి కెరీర్‌లో ఇది మరొక గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఇదంతా ‘రాజా సాబ్’ సక్సెస్‌పై కూడా ఆధారపడి ఉంది. ఈ మూవీ సక్సెస్ అయితే అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రమే కాదు.. ఏ స్టార్ హీరో అయినా మారుతికి అవకాశం ఇవ్వడానికి రెడీగానే ఉంటాడు.
ఫ్యాన్స్‌లో నమ్మకం
‘రాజా సాబ్’ (Raja Saab) సినిమాకు ఎంత నెగిటివిటీ వచ్చినా అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు మారుతి. అలా కొన్నాళ్ల క్రితం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. అందులో ప్రభాస్ కూల్ లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యి మారుతిని తెగ పొగిడేశారు. ఆ తర్వాత ముసలివాడి గెటప్‌లో ప్రభాస్‌కు సంబంధించిన మరొక పోస్టర్ బయటికొచ్చింది. దానికి ఫ్యాన్స్ ఫిదా అవ్వడం కాదు పూర్తిగా షాక్ అయిపోయారు. దీంతో ‘రాజా సాబ్’పై ఇప్పుడు ప్రేక్షకుల్లో కూడా నమ్మకం కలిగింది. 2025 సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే టీజర్ కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.