Anushka Shetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క (Anushka) ఇటీవల కాలంలో వెండితెరకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కనీసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలతో అయినా టచ్ లో ఉంటుందా అంటే… అది కూడా లేదు. దీంతో ఆమెను అభిమానులు బాగా మిస్ అవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పెద్దగా యాక్టివ్ గా లేనప్పటికీ, ఆమెకు మాత్రం భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న అనుష్క కేవలం ఒకే ఒక్క తెలుగు హీరోని ఫాలో అవుతుండడం విశేషం. అయితే ఆ ఒక్క హీరో ప్రభాస్ అనుకుంటే మీరు పొరబడినట్టే.
‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనుష్క (Anushka) కెరియర్ స్టార్టింగ్ లో గ్లామర్ పాత్రలలో అదరగొట్టింది. కానీ ‘అరుంధతి’ మూవీ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా మారింది అనుష్క. ‘అరుంధతి’ సినిమా ఈ అమ్మడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను తీసుకొచ్చి పెట్టింది. ఫలితంగా రాజమౌళి కళ్ళకి దేవసేనగా కనిపించింది. ఇంకేముంది ‘బాహుబలి’లో ఈ దేవసేన పర్ఫామెన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కానీ ఈ మూవీ తర్వాత ఒక్కసారిగా అనుష్క సినిమాల నుంచి సైడ్ అయిపోయింది. సాధారణంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోయిన్లు వరుస సినిమాలకు సైన్ చేస్తారు. కానీ అనుష్క మాత్రం చాలా తక్కువ సినిమాలే చేసింది. అనుష్క చివరగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దానికి కారణం అనుష్క లుక్స్. ‘సైజ్ జీరో’ సినిమా టైంలో బాగా లావైన అనుష్క, ఆ తర్వాత తగ్గడానికి కష్టపడిందని టాక్ నడిచింది.
అదే ఎఫెక్ట్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ టైంలో కూడా ఉందని టాక్ నడిచింది. అనుష్క (Anushka) శెట్టిని పూర్తిగా గ్రాఫిక్స్ చేశారని ట్రోల్ చేశారు. ఇక ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక మలయాళ సినిమాతో పాటు, రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ లో అనుష్క ఎవరిని ఫాలో అవుతుంది ?అనే చర్చ మొదలైంది సోషల్ మీడియాలో.
ప్రస్తుతం ఆమెకు ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అనుష్క మాత్రం కేవలం 12 మందిని ఫాలో అవుతుంది. అందులో ఒకే ఒక్క తెలుగు హీరో ఉండడం విశేషం. అయితే అనుష్క పేరు చెప్పగానే ప్రభాస్ (Prabhas) గుర్తొస్తాడు. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆశ్చర్యకరంగా తన బెస్ట్ ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పార్ట్నర్ ప్రభాస్ ని మాత్రం అనుష్క ఫాలో అవ్వట్లేదు. మరి ఈ అమ్మడు ఫాలో అవుతున్న సెలబ్రిటీల లిస్టులో ఎవరెవరు ఉన్నారు అంటే… రానా దగ్గుబాటి (Rana Daggubati). ఈ తెలుగు హీరోతో పాటు డైరెక్టర్ రాజమౌళి, కాజల్ అగర్వాల్, పీవీ సింధు, దుల్కర్ సల్మాన్ తదితరులు ఉన్నారు.