Prashanth Neel: ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో భాగంగా ఆర్సీబీ (RCB)విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 18 సంవత్సరాల తర్వాత ఈ జట్టు ఐపీఎల్ ఫైనల్ లో విజయం సాధించడంతో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prabhas)కూడా RCB విజయాన్ని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన RCB అభిమానులు కూడా మరింత వైరల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ షూటింగ్ లోకేషన్ లో…
ఈరోజు ప్రశాంత్ పుట్టినరోజు కావడంతో ఆయన భార్య లిఖితారెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని షేర్ చేశారు. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఆరుబయట పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని ఈ ఫైనల్స్ చూసినట్టు స్పష్టం అవుతుంది. ఇక ఈ ఫైనల్స్ లో RCB విజయం సాధించడంతో ఈయన సంతోషం పట్టలేక ఎగిరి గంతులేస్తూ ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఆయన సతీమణి లికితా రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…18 ఏళ్ళ కళ నెరవేరింది.. ఫైనల్లీ ఈసాలా కప్ నమ్‌దు. నేను తెలిసిన క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్ కి ఇదే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని రాసుకొచ్చారు.
పుట్టినరోజు…
ఇక నేడు ఈయన పుట్టినరోజు కావడంతో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సుమారు 18 సంవత్సరాల తర్వాత RCB కప్పు గెలుచుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఈ విజయానికి గర్విస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రశాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ (NTR)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ డైరెక్షన్లో డ్రాగన్ (Dragon)అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెలుగు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూనే మరోవైపు ప్రశాంత్ డైరెక్షన్లో కూడా బిజీ అవుతూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ నెలలో విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నటించబోతున్నట్లు తెలుస్తోంది.