Allu Ayaan Emotional: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసి… మొట్టమొదటిసారిగా చాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో 18 సంవత్సరాల తర్వాత తన కళ నెరవేర్చుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. తొలిసారి ప్రపంచకప్ స్థాయిలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గెలుచుకున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… ఆనందంలో మునిగిపోతుంది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ కావడంతో… దేశవ్యాప్తంగా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.
ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ
అల్లు అర్జున్ ఇంట్లో సంబరాలు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు గెలవడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో సంబరాలు కూడా జరిగాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కుమారుడు ఆయాన్ సంబరాలకు అంతులేకుండా పోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవగానే అయాన్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.
అలాగే తనకు కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా చెప్పుకో వచ్చాడు అల్లు అర్జున్ కుమారుడు అయాన్. బెంగళూరు కప్పు కొట్టడంపై అల్లు అర్జున్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. నిరీక్షణ ముగిసింది ఇక ఎట్టకేలకు కప్పు కొట్టారు అంటూ కంగ్రాట్స్ చెబుతూ… అల్లు అర్జున్ కూడా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలవగానే… చెంబడు నీళ్లు తనపై పోసుకొని.. ఎంజాయ్ చేశాడు ఆయాన్.
ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంత అంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. ఛాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. అయితే 18వ సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు… భారీ ప్రైజ్ మనీ దక్కింది. ఈ టోర్నమెంట్ లో ఏకంగా 20 కోట్లు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరుకు దక్కడం జరిగింది. అలాగే రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుకు 12.5 కోట్లు దక్కాయి. ఈ ప్రైజ్ మనీ నీ భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ప్రైజ్ మనీ… ఇటు రిషబ్ పంత్ తీసుకునే ప్రైజ్ మనీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఐపీఎల్ 2025 ప్రైజ్ మనీ 20 కోట్లు కాగా… రిషబ్ పంతుకు మాత్రం 27 కోట్లు దక్కుతున్నాయి. అంటే రిషబ్ పంత్ కంటే ఐపీఎల్ గెలిచిన రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
The Emotions of Allu Arjun's son when Virat Kohli & RCB won the IPL Trophy, He's crying. 🥹
– King Kohli, An Emotion..!!!! ❤️pic.twitter.com/OPyHnKBKI5
— Tanuj (@ImTanujSingh) June 4, 2025