BigTV English

OTT Movie : పాపం ఈ సైకోలు… కిల్లర్ గర్ల్ తో పెట్టుకుని అడ్డంగా బుక్… డెడ్లీ డెత్ గేమ్

OTT Movie : పాపం ఈ సైకోలు… కిల్లర్ గర్ల్ తో పెట్టుకుని అడ్డంగా బుక్… డెడ్లీ డెత్ గేమ్
Advertisement

OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలను ఓటీటీలో కూడా ఎక్కువగా చూస్తుంటారు.  ఎలాంటి కంటెంట్ సినిమాలు కావాలన్నా, ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్నాయి.  అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, సైకోల పని పడుతుంది? ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

అమెరికన్ యాక్షన్-హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫైనల్ గర్ల్’ (Final girl). 2015 లో వచ్చిన ఈ సినిమాకి టైలర్ షీల్డ్స్ దర్శకత్వం వహించాడు. ఇందులో అబిగైల్ బ్రెస్లిన్, అలెగ్జాండర్ లుడ్విగ్, వెస్ బెంట్లీ నటించారు. ఇది ఒక యువతి తన శత్రువులను ఎదుర్కొనే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. 78 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

వెరోనికా అనే 5 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులు అనుమానస్పదంగా చనిపోతారు.ఆ తరువాత అతను విలియం అనే వ్యక్తిని కలుస్తుంది. విలియం భార్య, బిడ్డను కూడా ఒక గ్యాంగ్ చంపి ఉంటారు. ఇక వెరోనికాను తనదగ్గరే పెట్టుకుంటాడు. ఆమెకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తాడు. ఈ శిక్షణతో ఆమె 12 సంవత్సరాల తర్వాత ఒక శక్తివంతమైన యోధురాలిగా మారుతుంది. విలియం ఆమెకు ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాడు. ఇది ఆమె భయాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వెరోనికా ఒక చిన్న పట్టణంలో కొత్తగా వచ్చిన అమ్మాయిగా పరిచయం చేసుకుంటుంది. అక్కడ నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ అయిన జేమ్సన్ , డానియల్, నెల్సన్, షేన్ బ్లాండ్ అమ్మాయిలను అడవిలోకి రప్పించి, ఒక గేమ్ అడిపిస్తూ చంపుతూ ఉంటారు.

ఇలా వాళ్ళ చేతిలో చాలామంది బలవుతారు. వీళ్ళు వెరోనికాను తమ తదుపరి టార్గెట్ గా ఎంచుకుంటారు. అయితే ఆమె ఒక శిక్షణ పొందిన అస్సాసిన్ అని వారికి తెలియదు. ఈ క్రమంలో వెరోనికాను జేమ్సన్ డేట్‌కు ఆహ్వానిస్తాడు. ఆమెను ఒక అడవిలోకి తీసుకెళ్తాడు. ఇక వెరోనికా అబ్బాయిలతో సరదాగా ఉంటూ వాళ్ళకు డ్రగ్స్ ఇస్తుంది. ఇవి వాళ్ళని అతి పెద్ద భయాలను హాలుసినేషన్స్‌గా చూపిస్తాయి. ఇదే అదును చూసి ఆమె ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంది. చివరికి వెరోనికా ఆ పోకరి గ్యాంగ్ ను అంతం చేస్తుందా ? వాళ్ళ చేతిలో బలి అవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పడుకున్న శవాన్ని లేపి మరీ తన్నించుకునే ఫ్యామిలీ… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హారర్ మూవీ

Related News

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్ ఉండగా మరొకడితో ఆ పని… నరాలు జివ్వుమన్పించే సీన్లు… సింగిల్స్ కు పండగే

OTT Movie : భర్త పోగానే మరొకడితో… రిపోర్టర్ తో మిస్టీరియస్ అమ్మాయి మతిపోగోట్టే పనులు… ఈ మూవీ కుర్రాళ్లకు మాత్రమే

OTT Movie : భర్తను కట్టేసి భార్యతో అపరిచితుడి ఆటలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : మంచాన పడ్డ తల్లి ఆఖరి కోరిక… కార్పొరేట్ వరల్డ్ తో కనెక్షన్… మనసును పిండేసే ఫ్యామిలీ మూవీ

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

Big Stories

×