BigTV English

Spirit: ప్రభాస్ బర్త్ డే.. స్పిరిట్ నుంచి స్పెషల్ పోస్టర్

Spirit: ప్రభాస్ బర్త్ డే.. స్పిరిట్ నుంచి స్పెషల్ పోస్టర్

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నేడు 45 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం బర్త్ డే విషెస్  తెలుపుతుంది. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేసి మేకర్స్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే  ది రాజాసాబ్ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా కాకుండా డార్లింగ్ నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి.


మిగతా సినిమాల గురించి ఏమో కానీ, స్పిరిట్ కోసం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్  వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ రూపురేఖలు మార్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.  ఈ సినిమా తరువాత గతేడాది అనిమల్ సినిమాతో బాలీవుడ్ మొత్తాన్ని షేక్ ఆడించాడు. హీరో అనే పదానికి పూర్తిగా అర్ధం మార్చేశాడు.  హీరో అంటే సైలెంట్ గా ఉండాలి.. సాఫ్ట్ గా ఉండాలి. తప్పు చేయకూడదు లాంటివన్నీ  కట్టి కబోర్డ్ లో  పెట్టి.. అనిమల్ లా ఉండాలని చూపించాడు. ఇక అనిమల్ తరువాత  సందీప్ దర్శకత్వం వహిస్తున్న సినిమానే స్పిరిట్.

Kanguva : సూర్య ‘కంగువ’ కు తెలుగు స్టార్ హీరోల సపోర్ట్.. మన హీరోలంటే అంత చిన్న చూపా..? 


ప్రభాస్ హీరోగా  తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో సెట్ మీదకు వెళ్లనుంది. ఇక మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్  పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. దీంతో స్పిరిట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక నేడు ప్రభాస్  పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ  బర్త్ డే విషెస్  తెలిపాడు. స్పిరిట్  టైటిల్ పోస్టర్ వెనుక హ్యాపీ బర్త్ డే రెబెల్ స్టార్  ప్రభాస్ అని రాసి ఉన్న పోస్టర్ ను పోస్ట్ చేస్తూ.. “పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ అన్న, మీ పుట్టినరోజు కూడా మీలాగే అపురూపంగా ఉండనివ్వండి” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Amaran Trailer: అప్పుడు మేజర్ సందీప్.. ఇప్పుడు మేజర్ ముకుంద్.. అదిరిపోయిన ట్రైలర్

అయితే  ఫ్యాన్స్ మాత్రం వేరే అప్డేట్ ఏదైనా ఇవ్వొచ్చుగా అని  కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్  వస్తాయని తెలుస్తోంది. అప్పటివరకు ఆగక తప్పదు. ఇక ఈ సినిమానే కాకుండాప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ప్రభాస్ – హను మేకర్స్ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్న  ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు.  ప్రస్తుతం ఈ పోస్టర్స్  నెట్టింట వైరల్ గా మారాయి. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×