Sekhar Kammula: టాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మసాలాలు, యాక్షన్స్ ఇలాంటివేమీ లేకుండా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఫ్యామిలీలు మొత్తం ఎలాంటి భయం లేకుండా థియేటర్ లో కలిసి చూసేలా శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ.. ఇలా ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక క్లాసిక్ అని చెప్పాలి. ఏడాదికి ఒక సినిమా చేయకపోయినా.. ఆయన ఎప్పుడు వచ్చినా ఆ సినిమా చరిత్ర సృష్టిస్తుంది.
2021 లో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేఖర్ కమ్ముల దాదాపు మూడేళ్ళ తరువాత కుబేర అనే సినిమాతో ఈ ఏడాది మరోసారి థియేటర్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒక భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే కుబేర త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన శేఖర్ కమ్ముల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం ధనుష్ ను ఎలా ఒప్పించాడో చెప్పుకొచ్చాడు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటిస్తాడో లేదో అనే అనుమానం ఉండేదని ఆయన చెప్పుకొచ్చాడు.
Rashmika Mandanna: పుష్పకు శ్రీవల్లీ.. చావాకు యేసుబాయి.. రష్మిక నామ సంవత్సరం మొదలు
“కుబేర కథ రెడీ అయ్యింది. ఈ కథను ధనుష్ కు ఎలా చెప్పాలా అని సంకోసించా. బిచ్చగాడి పాత్ర కదా.. ఆయన ఒప్పుకుంటాడా.. ? లేదా అని అనుమానం.ఇంకోపక్క అసలు నేను ఆయనకు తెలుసా.. ? అనే భయం. అలానే ధనుష్ కు కాల్ చేశాను. ఆయన నా సినిమాల గురించి.. అందులోని క్యారెక్టర్స్ గురించి చెప్పారు. నేను షాక్ అయ్యా. ఆలాంటి హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు. ధనుష్ గురించే కాకుండా రష్మిక గురించి కూడా శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.
” రష్మిక సెట్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్నిరోజులు షూటింగ్ లో రష్మిక ఎప్పుడు డల్ గా కనిపించింది లేదు. ఎంతో కష్టపడి పనిచేసింది. ఈ సినిమా కథ చెప్పేటప్పుడు ఒకపక్క యానిమల్ డబ్బింగ్ చెప్తూ.. ఇంకోపక్క పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమెను చూస్తే మీ పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.