Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని ఆయన కాపాడుతూ వస్తున్నాడు. మహేష్ కు తెలిసినవి రెండే రెండు ఒకటి ఫ్యామిలీ.. రెండు సినిమా. వీటికి మించి మహేష్ ఏ వివాదాల్లోనూ తలా దూర్చడు. ఇక సినిమా అంటే మహేష్ కు ఎంత ప్రాణమో అందరికీ తెల్సిందే. ఆయన సినిమా అనే కాదు. ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కూడా మహేష్ వీక్షిస్తాడు. కేవలం వీక్షించడమే కాకుండా ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు.
తెలుగు అనే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ , హాలీవుడ్.. ఏ భాషలో అయినా హిట్ సినిమాను అస్సలు వదలడు. కేవలం సినిమాలేనా సిరీస్ ల గురించి కూడా మహేష్ రివ్యూలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు.. సంక్రాంతి కి వస్తున్నాం సినిమాను వీక్షించి.. తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు.
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. వెంకీ మామ కెరీర్ లోనే రికార్డు వసూళ్లును రాబట్టింది ఈ సినిమా. ఒక్క రోజులోనే రూ. 45 కోట్లు కొల్లగొట్టి శభాష్ అనిపించింది.
Ghaati: దేసి రాజు.. దిమ్మ తిరిగే యాక్షన్ తో అదరగొట్టేశాడు.. చివర్లో స్వీటీ లుక్ మాత్రం..
ఇక కొద్దిగా అనిల్ రావిపూడి క్రింజ్ కామెడీ ఉన్నా కూడా ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతి విన్నర్ గా నిలబెట్టారు. దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాల్లో గేమ్ ఛేంజర్ పరాజయాన్ని అందుకున్నా.. ఈ సినిమా మాత్రం మంచి హిట్ అందుకొని నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా చూసిన వారందరూ మంచి సినిమా అని, ముఖ్యంగా బుల్లి రాజు పాత్రలో నటించిన అబ్బాయిని తెగ మెచ్చేసుకుంటున్నారు.
తాజాగా మహేష్ బాబు సైతం సంక్రాంతికి వస్తున్నాం టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. చిత్ర బృందంతో పాటు స్పెషల్ గా బుల్లి రాజు పాత్రను కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. “సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను. సరైన పండగ చిత్రం. వెంకీ సార్ చాలా అద్భుతంగా నటించారు. వరుస బ్లాక్ బస్టర్స్ అందించినందుకు నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూసి చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉంది. మీనాక్షీ, ఐశ్వర్య తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. బుల్లి రాజు పాత్రలో నటించిన పిల్లవాడు.. సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాడు. మొత్తంచిత్రబృందానికి మరియు సిబ్బందికి అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు. మహేష్ ఇచ్చిన రివ్యూతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
ఇక వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు. మొదటి నుంచి వీరి మధ్య స్నేహ బంధం ఉన్నా ఈ సినిమా తరువాత అది మరింత పెరిగింది. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా చిన్నోడు , పెద్దోడు అని పిలవడం అభిమానులకు అలవాటుగా మారింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే మహేష్.. అనిల్ ను నా డైరెక్టర్ అని పిలిచాడు. మరి మహేష్ పోస్ట్ పై అనిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film… @VenkyMama sir is just terrific👌👌👌
So proud and happy for my director @AnilRavipudi
for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters.
The kid "Bulli…— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025