Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటించి అనంతరం హీరోగా అవకాశాలను అందుకున్నారు. ఇలా తన సినీ కెరియర్లో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక మోహన్ బాబు హీరోగా మాత్రమే కాదు విలన్ పాత్రలకు కూడా పెట్టింది పేరని చెప్పాలి. గతంలో స్టార్ హీరోల సినిమాలలో ఈయన విలన్ గా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.
చిరంజీవి సినిమాలోనా…
ఇక ఇటీవల కాలంలో మోహన్ బాబు సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి . కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే ఈయన నటిస్తున్నారు. ఇక త్వరలోనే తన కుమారుడు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా(Kannappa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో తెరికెక్కిన ఈ సినిమా ఈనెల 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మోహన్ బాబు కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా ఈయన తనకు విలన్ పాత్రలలో నటించాలని ఇప్పటికీ ఉంది అంటూ తెలియజేశారు. అయితే సరైన విలన్ పాత్ర దొరికితే మోహన్ బాబు నటించిన సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.
మరోసారి విలన్ గా మోహన్ బాబు…
ఈ క్రమంలోనే మోహన్ బాబును టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిశారు. మోహన్ బాబును కలిసిన శ్రీకాంత్ ఆయనతో ఓ సినిమా గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇక విలన్ పాత్ర కోసమే శ్రీకాంత్ మోహన్ బాబుని సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ” ది ప్యారడైజ్” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈయన డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. నాని హీరోగా ఇదివరకు శ్రీకాంత్ దర్శకత్వంలో దసరా వంటి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే నాని తదుపరి తనకు అవకాశం ఇవ్వడమే కాకుండా, తన నిర్మాణంలో శ్రీకాంత్ డైరెక్షన్లో చిరంజీవి సినిమాకు కూడా కమిట్ అయ్యారు.
శ్రీకాంత్ దర్శకత్వంలో నాని నిర్మాణ సారథ్యంలో చిరంజీవి హీరోగా ఇటీవల సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే చిరంజీవి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మరి శ్రీకాంత్ విలన్ పాత్ర కోసం మోహన్ బాబుని కలవడంతో ఈయన ఏ సినిమా కోసం తనని సంప్రదించారనే విషయం పట్ల స్పష్టత లేకపోయిన. మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారంటే అటు నాని పారడైజ్ సినిమా కోసం లేదా చిరంజీవి సినిమా కోసం అయ్యుంటుందని తెలుస్తుంది. శ్రీకాంత్ చెప్పిన ఈ పాత్ర మోహన్ బాబుకి కూడా బాగా నచ్చిందని, త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక మోహన్ బాబు విలన్ గా అంటే శ్రీకాంత్ గట్టిగానే ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది.