Pooja Hegde: సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ నటీనటులకు డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ అనేవి ఉంటాయి. ఫలానా దర్శకుడితో కలిసి పనిచేయాలి, ఫలానా నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అందరికీ అనిపించడం కామన్. అలాగే స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డేకు కూడా అలాంటి డ్రీమ్ రోల్ ఉందట. దానిని డ్రీమ్ రోల్ అనకుండా డ్రీమ్ రోల్స్ అంటే బెటర్‌గా ఉంటుందేమో. ఎందుకంటే పూజా లిస్ట్ అంత పెద్దగా ఉంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘దేవ’లో హీరోయిన్‌గా అలరించిన పూజా హెగ్డే.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాను అసలు ఎలాంటి సినిమాల్లో, ఎలాంటి పాత్రల్లో నటించాలని అనుకుంటుందో బయటపెట్టింది.
ఎన్నో కోరికలు
ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ వరకు చేరుకొని ఇప్పుడు ఒక్క హిట్ కోసం కష్టపడుతోంది పూజా హెగ్డే. టాలీవుడ్ నుండి స్టార్‌డమ్ సంపాదించుకున్న పూజాకు ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. అందుకే పూర్తిగా బాలీవుడ్, కోలీవుడ్‌పైనే తన ఫోకస్ షిఫ్ట్ చేసింది. ఇటీవల షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘దేవ’లో కనిపించి అలరించింది. ఈ మూవీలో పూజా యాక్టింగ్ కంటే తన గ్లామర్ డోస్, లిప్ లాక్స్ గురించే ఎక్కువగా ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను మరికొందరు ప్రేక్షకుల్లో తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. ఆ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజా హెగ్డే (Pooja Hegde) తన మనసులోని కోరికలను బయటపెట్టింది.
ఇండియాలో చేయలేదు
‘‘నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నేను ఒక యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నాను. అందులో యాక్షన్ అంతా నేనే చేయాలి. నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. క్యారెక్టర్ డ్రామాస్ ఇష్టం. నాకు ఒక తండ్రీ, కూతురు కథ లేదా తల్లి, కూతురు కథలో నటించాలని ఉంది. దాంతో పాటు ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిన కథలో కూడా నటించాలని ఉంది. పిల్లల కోసమే ఎక్స్‌క్లూజివ్‌గా ఒక సినిమా చేయాలని ఉంది. ఎందుకంటే నేను హ్యారీ పాటర్ లాంటి కథలు చూస్తూ పెరిగాను. మ్యాజిక్ ఉండే కథలు అంటే నాకు చాలా ఇష్టం. ఇండియాలో అలాంటి జోనర్స్‌లో పెద్దగా సినిమాలు రాలేదు’’ అంటూ పెద్ద లిస్టే చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
Also Read: ఆ యంగ్ హీరో కోసం సినిమా వదిలేసుకున్న అనన్య.. మరీ ఇంత ప్రేమ.?
ఇన్‌స్పైర్ అయ్యేలా ఉండాలి
‘‘నేను ఏదో ఒకరోజు కెప్టెన్ మార్వెల్ లాంటి కథలో కూడా నటిస్తాను. అందులో నేను సూపర్ హీరో అయ్యింటాను. మనం సినిమాలను చూడడానికి ఇష్టపడడానికి కారణాలు ఉంటాయి. స్క్రీన్‌పైన కనిపిస్తున్న హీరోల్లో మనల్ని మనం చూసుకుంటాం లేదా అది మనమే అనుకుంటాం. కొన్ని పాత్రలు చూసి మనలాగే ఉన్నాయి అని ఫీలవుతాం. తెరపై కొన్ని పాత్రలు చూసినప్పుడు ఇన్‌స్పైర్ అయ్యి వాళ్లలాగా ఉండాలని అనుకుంటాం. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుందని.. అలాంటి పాత్రల్లో తనను తాను చూసుకోవాలని ఉందంటూ పూజా చెప్పుకొచ్చింది.