Vishnuvardhan: టాలీవుడ్ స్టార్ హీరోలందరూ.. ఎక్కువ చెన్నైలోనే చదువుకున్నరన్న విషయం చాలామందికి తెలియదు. మహేష్ బాబు, రానా , చరణ్, మంచు బ్రదర్స్..ఇలా నెపో కిడ్స్ అందరూ చెన్నైలోనే చదువుకున్నారు. ఇక అక్కడ స్కూల్, కాలేజ్ లలో చదువుకున్న ఫ్రెండ్స్ గురించి ఇప్పటికీ స్టార్ హీరోలు మాట్లాడుతూ ఉంటారు. తెలుగు హీరోలు, తమిళ్ హీరోలు ఒకే స్కూల్ లో చదువుకున్నవారు కూడా ఉన్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం చెన్నైలోనే చదువుకున్నాడు. ఆయనకు తమిళ్ హీరో సూర్య క్లాస్ మేట్ . ఇక సూర్యతో పాటు డైరెక్టర్ విష్ణువర్ధన్ కూడా మహేష్ క్లాస్ మేట్ నే. ఇక విష్ణు వర్ధన్ గురుంచి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో మంచి మంచి హిట్ సినిమాలను తెరకెక్కించిన విష్ణు వర్ధన్ తెలుగులో పవన్ కళ్యాణ్ తో పంజా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. పవన్ సూపర్ కూల్ గ్యాంగ్ స్టర్ గా చూపించిన ఘనత మాత్రం ఆయనకే చెల్లుతుంది. ఇప్పటికీ పవన్ పంజా లుక్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక పంజా తరువాత తెలుగు సినిమాల వైపు చూడని విష్ణువర్ధన్.. చాలా గ్యాప్ తరువాత ప్రేమిస్తావా అనే సినిమాను తెరకెక్కించాడు. ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 30.. అనగా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణువర్ధన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో విష్ణువర్ధన్.. మహేష్ తో ఉన్న స్నేహం గురించి మాట్లాడాడు.
Golden Sparrow: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన గోల్డెన్ స్పారో తెలుగు వెర్షన్.. విన్నారా
“మహేష్, నేను చిన్నప్పుడు క్లాస్ మేట్స్. కేవలం క్లాస్ మేట్స్ మాత్రమే కాదు బెంచ్ మేట్స్ కూడా. అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం చాలా బలంగా ఉండేది. అప్పుడు మేము ఇద్దరం కలిసి చాలా అల్లరి పనులు చేసేవాళ్లం. అవన్నీ కెమెరా ముందు చెప్పకూడదు. అయితే ఒక విషయం చెప్పాలంటే మాత్రం.. ఒకసారి బయట ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యాయి అని వార్త వచ్చింది. అది నేను వెళ్లి మహేష్ కు చెప్పాను. మహేష్ ఎక్కడ అని అడిగాడు. వెంటనే మేము ఇద్దరం వెళ్లి 500 కు ఎగ్జామ్ పేపర్స్ కొన్నాం.. కానీ, ఆ తరువాత అవి ఫేక్ అని తెల్సింది.
అలా ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నిటికి వెళ్లి క్వశ్చన్ పేపర్ కొన్నాం. అవన్నీ ఫేక్ అని తెలిసీ.. దీనికన్నా చదువుకుంటే బెటర్ అనుకున్నాం. అప్పుడు ఇదంతా సరదాగా చేసాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.