Disha Patani: యంగ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. తనకంటూ హీరోయిన్‌గా ఒక స్టేటస్ సంపాదించుకుంది. కానీ చాలామంది ఇతర హీరోయిన్స్‌లాగా తను మాత్రం తన సోదరిని హీరోయిన్ చేయాలని అనుకోలేదు. కానీ అప్పుడప్పుడు దిశా పటానీ సోదరి ఖుష్భూ పటానీ మాత్రం మీడియా ముందు కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఖుష్భూ పటానీ చేసిన సాహసం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక చిన్నారిని కాపాడడం కోసం తను ఏం చేసిందో అంతటా వైరల్ అయ్యింది. దాంతో ప్రేక్షకులంతా తనను ప్రశంసలతో ముంచేస్తున్నారు. దీని గురించి తర్వాత తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా షేర్ చేసింది.
ఎవరో తెలియదు
బరేలి ప్రాంతంలో ఒక చిన్నారి ప్రాణాలను కాపాడింది దిశా పటానీ సోదరి ఖుష్భూ పటానీ. ఖుష్భూ ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో ల్యూటెనెంట్‌గా పనిచేసింది. ఇటీవల తను తన తల్లితో కలిసి బయటికి వెళ్లింది. అదే సమయంలో తన తల్లికి ఒక చిన్నారి ఏడుపులు వినిపించాయట. వైరల్ అవుతున్న వీడియోలో చిన్నారి శరీరంపై, మొహంపై గాయాలు ఉండగా.. తనను ఖుష్భూ దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ కనిపించింది. అసలు ఆ చిన్నారిని అలా వదిలేసినందుకు తన తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆ చిన్నారి ఎవరో తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ఖుష్భూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది మీ బిడ్డ
ఈ ఘటనలో ఖుష్భూ పటానీ (Khushboo Patani) మాత్రమే కాదు.. తన తల్లి కూడా చిన్నారికి సాయం చేస్తూ కనిపించింది. ఆ చిన్నారిని దగ్గర తీసుకొని, తనకు పాలు అందించింది. ఈ వీడియోలో ‘‘చిన్నారిని ఎవరో కొట్టారు. అసలు ఎలాంటి మనుషులు ఉన్నారు?’’ అంటూ సీరియస్ అవుతూ కనిపించింది ఖుష్భూ పటానీ. ‘‘ఒకవేళ మీరు బరేలి నుండి అయ్యింటే ఇది మీ బిడ్డ. అసలు తన తల్లిదండ్రులు తనను ఇక్కడ ఎలా వదిలేశారో మీరే సమాధానం చెప్పాలి. ఇలాంటి తల్లిదండ్రులు సిగ్గుపడాలి’’ అని తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆ చిన్నారి పేరు రాధ అని, ప్రస్తుతం తనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని బయటపెట్టింది.
Also Read: సలార్ నా సినిమా కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన శృతి హాసన్
సినీ సెలబ్రిటీల సపోర్ట్
‘మన దేశంలో అమ్మాయిలను కాపాడండి. ఎన్నోళ్లు సాగుతుంది ఈ దౌర్జన్యం. నేను ఆ చిన్నారి సరైనవారి చేతుల్లోకి వెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. తన జీవితం బాగుండేలా చూసుకుంటాను. ఎవరైతే సాయం చేయడానికి ముందుకొస్తారో వారికి మంచే జరుగుతుంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసింది ఖుష్భూ పటానీ. తను షేర్ చేసిన ఈ పోస్ట్‌కు సినీ సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అయ్యారు. ఆ చిన్నారికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఖుష్భూ పటానీ.. ప్రస్తుతం ఫిట్‌నెస్ కోచ్‌గా, కౌన్సిలర్‌గా కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది. దిశా పటానీ సోదరి మంచితనానికి ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
फिल्म अभिनेत्री दिशा पाटनी की बहन खुशबू पाटनी ने हाल ही में एक मासूम बच्ची की जान बचाकर इंसानियत की मिसाल पेश की है. खुशबू पाटनी ने बरेली में अपने घर के पास एक लावारिस बच्ची को बचाया!#DishaPatani #KhushbooPatani #RescuedGirlChild
— Chandan Jha (@chandan_jha_11) April 20, 2025