Megastar Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకున్నాడో అందరికి తెలిసిందే. కష్టపడే మనిషి అత్యున్నత స్థానాలకు చేరుకుంటాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన చిరు.. ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒక్కసారి ఇండస్ట్రీలోకి యాక్టర్ గా అడుగుపెట్టి విలన్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా ఛాన్స్ రావడంతో తన నటనతో విజ్రూంభించాడు.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికి కొడుకుతో పోటీ పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాంటి చిరు హీరోగానే కాకుండా కొరియోగ్రాఫర్ గా చేశాడన్నా సంగతి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ చిరు ఓ పాటకు ఆయనే డ్యాన్స్ స్టెప్పులను కంపోజ్ చేశాడు. ఆ సాంగ్ ఏంటి? ఏ మూవీలోది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కొరియోగ్రాఫర్ గా మెగాస్టార్ చేసిన సాంగ్..?
మెగాస్టార్ చిరంజీవి మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే.. డాన్సర్ గా సింగర్ గా హీరోగా ఇలా ఆయనలోని ప్రతిభను సినిమాల ద్వారా బయట పెట్టాడు. అయితే ఇప్పటివరకు చిరంజీవి గురించి తెలియని ఒక నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే చిరంజీవి కొరియోగ్రాఫర్ గా చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్.. అవును ఆ పాటకు డ్యాన్స్ స్టెప్పులు ఒక్కరోజులోనే నేర్పించాడట.. ఇంతకీ ఆ సాంగ్ ఏదో తెలుసుకోవాలని ఆత్రుత పడుతున్నారు కదు.. ఆ పాట అభిలాష మూవీలోని సందే పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ నవ్వింది అనే సాంగ్. కె.యస్.రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ నిర్మించడం విశేషం! రాధిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983 మార్చి 11న విడుదలైన ‘అభిలాష’ సినిమా సైతం మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ కు ఇళయరాజా బాణీలు కూడా తోడయ్యాయి..
Also Read : డైరెక్టర్ హరీష్ శంకర్ పరిస్థితి దారుణం.. పవన్ కళ్యాణ్ వల్లే భారీ నష్టం..!!
విశ్వంభరా మూవీ..
చిరంజీవి గతేడాది నటించిన భోళాశంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. కథలు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకొని మరి ఇప్పుడు విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు. బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాపై చిరు ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ మే నెలలో ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమాకి రూ.150 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. కాబట్టి.. అన్ని భాషల్లోని ఓటీటీ రైట్స్ నుండి రూ.75 కోట్లు రాబట్టుకోవాలనేది వారి ఆలోచన. అంటే 50 శాతం రికవరీ వాళ్ళు ఆశిస్తున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..