Yadagirigutta: యాదగిరిగుట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామిలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఐదంతస్థుల స్వర్ణ సుదర్శన విమాన గోపురం ఆదివారం భక్తులకు దర్శనం ఇవ్వనుంది. దేశంలో అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురం. ఈ గోపురంలో నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు ఉండనున్నాయి.
స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచ కుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించనున్నారు. దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
యాదగిరి గుట్టుకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది జిల్లా యంత్రంగం. ఆదివారం ఉదయం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి యాదగిరిగుట్టకు రానున్నారు సీఎం. హెలిపాడ్ నుంచి నేరుగా అతిథిగృహానికి వెళ్లనున్నారు.
అక్కడ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి గుట్టపై ఉన్న యగశాలకు చేరుకుంటారు. మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం ఘట్టంలో పాల్గొంటారు. ఉదయం 11.54 గంటలకు మూలా నక్షత్రం వృషభ లగ్నం ముహూర్తాన బంగారు విమాన గోపురం ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ALSO READ: విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ ఫోకస్
ఖర్చు ఎంత?
వానమామలై మఠం పీఠాధిపతి మధురకవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి దాదాపు 40 జీవ నదుల నుంచి జలాలు సేకరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఇందుకోసం అనేక మంది భక్తులు, దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం రెడీ కాలేదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న పనుల గురించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా మంత్రులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. ఆలయ రాజ గోపురం 50.5 అడుగుల ఎత్తు కాగా, గోపురం వైశాల్యం సుమారు 10,759 చదరపు అడుగులు. బంగారు తాపడం కోసం మొత్తం 68 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సుమారు రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం, నగదుతోపాటు స్వామి వారి హుండీ ఆదాయం నుంచి డబ్బులను ఖర్చు చేశారు. దీంతో పనుల వేగం జోరందుకున్నాయి. పనులు జరిగిన సమయంలో గోపురం వద్దకు ఎవరిని అనుమతించ లేదు. సీసీ కెమెరాల మధ్య గోపురం పనులు జరిగాయి. గతేడాది నవంబర్‌లో మొదలైన పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేశారు.
విమాన గోపురం స్వర్ణ తాపడం పనులను తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ టీమ్ చేసింది. స్వర్ణ తాపడానికి ముందు రాగి తొడుగుల కోసం 1100 వందల కిలోల రాగిని వినియోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో ఈ తరహా విమాన గోపురం ఎక్కడ లేదు.
నేడు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం
ఉ.11.54 గంటలకు మూలా నక్షత్రం వృషభ లగ్నం ముహూర్తాన బంగారు విమాన గోపురం ఆవిష్కరణ
స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా… pic.twitter.com/vnc9Ag2WFV
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025