India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. శత్రు దేశాలైన పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయిలోని ( Dubai) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం… ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. ఈ మేరకు.. ఐసీసీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ… హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం జరగబోయే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ కు టీమిండియా స్టార్ ఆటగాడు దూరం కాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
Also Read: AUS vs ENG: జోష్ ఇంగ్లిస్ విధ్వంసం..ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసీస్ భారీ విజయం
పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఆడటం అనుమానంగా ఉందని జాతీయ మీడియా లో కథనాలు వస్తున్నాయి. నిన్న దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ కాలికి గాయం అయిందట. దీంతో ఐస్ ప్యాక్ తో రెస్ట్ తీసుకుంటూ…. విరాట్ కోహ్లీ కనిపించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… నిజంగానే విరాట్ కోహ్లీ కి గాయమైనట్టు తేలిపోయింది. దీంతో.. టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గతంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ కారణంగానే టీమిండియా గెలిచింది. అయితే అలాంటి విరాట్ కోహ్లీ ఇవాళ గాయంతో దూరమైతే టీమిండియా కు ఎదురు దెబ్బ తగలక తప్పదని అంటున్నారు. అయితే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ గాయం పై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి.
లైవ్ ప్రసారాలు
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రసారం కానుండగా… దీన్ని జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్, న్యూస్ 18 చానల్స్ కూడా మ్యాచ్ ప్రసారాలను అందిస్తున్నాయి. తెలుగు భాషలో కూడా మనకు కామెంట్రీ వస్తుంది.
Also Read: India vs Pakistan: రోహిత్ శర్మ vs రిజ్వాన్… టీమిండియా గెలిచే Percentage ఎంతంటే ?
జట్ల వివరాలు
టీమిండియా : రోహిత్ శర్మ (C), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ లేదా పంత్ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్. షమీ
పాకిస్థాన్ 11 ప్రాబబుల్స్: బాబర్ అజామ్, ఇమామ్-ఉల్-హక్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (C), సల్మాన్ అలీ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.