Pawan Kalyan Son : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ఇటీవలే ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.. సింగపూర్ లో మార్క్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మార్కుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్యం హాస్పిటల్ కి తరలించడంతో మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడు. మార్క్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్కు తిరిగి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దైవచింతన ఎక్కువగా ఉండే పవన్ కళ్యాణ్ తన కొడుకు పేరును ఇలా విచిత్రంగా పెట్టడం ఏంటి? అని సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. నా పేరు గల అసలు అర్థం ఏంటో తెలుసుకోవాలని అటు పవన అభిమానులు ఇటు సామాన్య ప్రజలు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా సినీ నటి, టిడిపి నేత దివ్యవాణి ఈ పేరు గల అసలు అతన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇంతకీ ఆ పేరుకు అర్థం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మార్క్ శంకర్ పేరుకు అర్థమేంటంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా దంపతుల కుమారుడు ఈ మార్క్ శంకర్.. గతంలో ఈ బాలుడు చిన్నప్పుడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పటినుంచి ఇప్పటివరకు అతని ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఇటీవల ఆ బాలుడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అదే అతని పేరు వెనక అర్థమేంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ పేరునించుకున్నారని ఆయన ఫ్యాన్స్ గూగుల్లో వెతికేస్తున్నారు. తాజాగా సినీ నటి దివ్యవాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మార్క్ శంకర్ అసలు అర్థం ఏంటో బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. మార్క్ శంకర్ కి ఇలా ఒక ప్రమాదం జరగడం అందరినీ కదిలించివేసింది. ఆ పిల్లాడు కోలుకోవాలని తెలుగు ప్రజలందరూ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. నేను కూడా అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశాను. అయితే కొందరు మాత్రం అతనిపై తప్పుడు ప్రచారాలు చేశారు అది కాస్త బాధగానే అనిపించిందని ఆమె అన్నారు. ఇక మార్క్ శంకర్ ఈ పేరుకు అర్థం చాలా మందికి తెలియదు.. మార్క్ అనేది దేవుని గురించి రచించేవాడు అని అర్థం. ఇక శంకర్ అంటే ఆ బోలా శంకరుడు అని ఆమె వివరించింది.. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవన్ కళ్యాణ్ ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి మార్క్ శంకర్ టాపిక్ మరోసారి హైలెట్ అయింది..
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..
మార్క్ శంకర్ ను ఎందుకు గోప్యంగా ఉంచారు..?
పవన్ కళ్యాణ్ కు నలుగురు సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే అకిరా నందన్, ఆద్యాల గురించి అందరికీ తెలుసు. కానీ అంజన, మార్క్ శంకర్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఇటీవల తిరుమలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు అంజనను అందరికీ పరిచయం చేశారు. రీసెంట్ గా తన చిన్న కొడుకు చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరగడంతో అతని ఫోటోలు వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ పై నెట్టింట పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ కి పుట్టిన పిల్లల్ని పరిచయం చేశారు.. కానీ అన్నా లెజ్నోవా పిల్లలను ఎందుకు పరిచయం చెయ్యలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరినీ దాచి పెట్టారో ఎవరికి అర్థం కాదు దీనిపై ఆయనే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..