BigTV English
Advertisement

Sikandar: ‘సికందర్’ సెన్సార్ పూర్తి.. కత్తెర ఎక్కువే పడిందిగా..

Sikandar: ‘సికందర్’ సెన్సార్ పూర్తి.. కత్తెర ఎక్కువే పడిందిగా..

Sikandar: స్టార్ హీరో సినిమాలు అంటే మేకర్స్ మరీ జాగ్రత్తగా ఉంటారు. సెన్సార్ నుండి ఎక్కువగా కత్తెర్లు పడకుండా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు దర్శకులు అలా కాదు.. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కూడా ఒకరు. ముఖ్యంగా మురుగదాస్ తెరకెక్కించిన పొలికటల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘సికందర్’ మూవీలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. అందుకే సెన్సార్ బోర్డ్ దీనిపై యాక్షన్ తీసుకుంది. తాజాగా ‘సికందర్’ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి.


సెన్సార్ పూర్తి

మురుగదాస్ (Murugadoss), సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘సికందర్’. ఈ సినిమా మార్చి 30న రంజాన్ ముందు రోజు విడుదలకు సిద్ధమయ్యింది. రంజాన్ పండగ అంటే సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే అన్నది ఎప్పటినుండో బాలీవుడ్ ప్రేక్షకుల సెంటిమెంట్. అలాగే ఈ ఏడాది రంజాన్‌కు ‘సికందర్’తో ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు సల్లూ భాయ్. ఈ మూవీలో రష్మిక మందనా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బయటికొచ్చాయి. సల్మాన్ ఫ్యాన్స్ వీటన్నింటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యి డ్యూరేషన్ లాక్ అయ్యింది.


అవన్నీ కట్

‘సికందర్’ (Sikandar) సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చిన్న చిన్న కట్స్ మాత్రమే చెప్పినట్టు సమాచారం. ఒక సీన్‌లో హోమ్ మినిస్టర్ పేరుతో వచ్చే డైలాగ్‌లో హోమ్ అనే పదాన్ని తీసేసి కేవలం మినిస్టర్ అనే పెట్టమని సీబీఎఫ్‌సీ ఆదేశించింది. అంతే కాకుండా ఒక పొలిటికల్ పార్టీలకు సంబంధించిన జెండాలను బ్లర్ చేయమని చెప్పింది. ఇక ఈ సినిమాకు సంబంధించి సీబీఎఫ్‌సీ ఎలాంటి విజువల్ కట్స్ చేయలేదు. యాక్షన్ సీన్స్‌లో కూడా ఎలాంటి కట్స్ అవసరం లేదని తేల్చేసింది. అలా సెన్సార్ పూర్తయిన తర్వాత ‘సికందర్’ సినిమా 2 గంటల 30 నిమిషాల 8 సెకండ్ల డ్యూరేషన్‌ను లాక్ చేసుకుంది.

Also Read: నాకు ఆ వ్యాధి ఉంది, కానీ ఎవ్వరికీ తెలియనివ్వలేదు.. సీనియర్ నటి స్టేట్‌మెంట్

అంతా రొటీన్

‘సికందర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చాలా రొటీన్‌గా ఉందని, ఇందులో ఏ అంశం కూడా కొత్తగా కనిపించడం లేదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రమే సినిమాలో మాస్ స్టఫ్ ఉందని పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. మామూలు మూవీ లవర్స్ మాత్రం సల్లూ భాయ్ ఇతర సినిమాలలాగానే ఇందులో కూడా రొటీన్ స్టోరీ, రొటీన్ యాక్షన్ ఉందని ఫీలవుతున్నారు. మూవీ టీమ్ మాత్రం దీని హిట్‌పై నమ్మకంతో ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం దర్శకుడు మురుగదాస్‌కు మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే ఈ హిట్ చాలా అవసరం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×