BigTV English

OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీపై డీవీవీ ఫుల్ క్లారిటీ..!

OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీపై డీవీవీ ఫుల్ క్లారిటీ..!

OG: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నటిస్తున్న పలు చిత్రాలకు బ్రేక్ పడింది. అందులో ‘OG’ మూవీ ఒకటి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం అయిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన భాగం మొత్తం ఎన్నికలు పూర్తయిన తర్వాత షూటింగ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ చాలా కాలం తర్వాత మొదటిసారి గ్యాంగ్ స్టార్‌గా కనిపించబోతున్నారు. దీంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త బయటకొచ్చి వైరల్‌గా మారింది. ఈ సినిమా నిర్మాణం నుంచి డీవీవీ బ్యానర్ వారు తప్పుకున్నారని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఈ వార్తలపై తాజాగా పై రెండు నిర్మాణ సంస్థలు క్లారిటీ ఇచ్చాయి.

ఓజీ సినిమాపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీపుల్ మీడియా వారు స్పష్టం చేశారు. ఇక డీవీవీ బ్యానర్ విషయానికొస్తే.. మేము ఈ సినిమాను అస్సలు వదులుకోవడం లేదని.. ఈ సినిమాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. ఈ వారం కూడా ఈ సినిమాకి సంబంధించిన మీటింగ్ ఉందని తెలిపారు. దీంతో ఈ రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×