Fahadh Faasil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. పార్టీ లేదా పుష్ప అంటూ ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహాద్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. పుష్ప- భన్వర్ సింగ్ మధ్య ఇగో క్లాషెస్ రేగడంతో మొదటి పార్ట్ ముగిసింది.
ఇక పుష్ప.. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. స్టైలిష్ స్టార్ ను కాస్తా ఐకాన్ స్టార్ ను చేసింది. రష్మికను నేషనల్ లెవెల్ శ్రీవల్లీగా మార్చేసింది. ఇక సినిమాకు మెయిన్ హైలైట్ అంటే ఫహాద్ మాత్రమే. ఒక మలయాళ స్టార్ హీరోను.. విలన్ గా తీసుకోవడం అనేది సుకుమార్ ప్లాన్ అయితే .. ఆ పాత్రను ఫహాద్ తో చేయించి మరింత హైప్ తీసుకొచ్చారు. పార్ట్ 1 లో ఫహాద్ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. క్లైమాక్స్ లో పుష్ప- భన్వర్ సింగ్ మధ్య జరిగిన గొడవతో.. సెకండ్ పార్ట్ లో వీరిద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్ యుద్దమ్ ఉండబోతుందని, సెకండ్ పార్ట్ లో ఫహాద్ మ్యాజిక్ చూపిస్తాడని అనుకున్నారు.
Pushpa 2: మొత్తానికి ‘పుష్ప 2’ మేకర్స్‌ను కనికరించిన మెగాస్టార్.. మరి బన్నీ ఎక్కడ?
ఇక దాదాపు మూడేళ్ల తరువాత ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఈరోజు రిలీజ్ అయ్యింది. పుష్ప 2 సినిమాలో అందరి క్యారెక్టర్స్ కంటే.. భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ పైనే ఫ్యాన్స్ అందరి దృష్టి పడింది. మొదటి పార్ట్ లో ఫహాద్ పాత్ర ఎంత అయితే ఉందో సెకండ్ పార్ట్ లో కూడా అంతే ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అసలు మెయిన్ విలన్ ఫహాద్ నే అని అనుకున్నవారు నిరాశకు గురి అయ్యారు.
సినిమా మొత్తంలో అక్కడక్కడా వీరిద్దరి మధ్య పగను చూపించారు కానీ, కథ మొత్తం వేరే నడిచింది. శ్రీవల్లి చెప్పిన మాట కోసం.. రావు రమేష్ ను సీఎం చేయడానికి పుష్ప ఏం చేశాడు అనేదే పుష్ప 2 కథ. ఇక ఇందులో భన్వర్ సింగ్ పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. ఉన్నంతసేపు కూడా ఫహాద్ తన నటనతో మెప్పించాడు.
Pushpa 2: అల్లు అర్జున్ టీమ్ పై కేస్ ఫైల్..బన్నీ రియాక్షన్ ఏంటో?
అయితే ఈ మాత్రం దానికోసమేనా ఇన్నేళ్లు ఎదురుచూసింది. ఫహాద్ మ్యాజిక్ చేస్తాడు అనుకున్నాం.. అసలు ఎంట్రీ వచ్చింది పోయింది కూడా తెలియలేదు అని ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమా తరువాత ఫహాద్ పై ట్రోల్స్ రావడం తో ఆయన ఫ్యాన్స్.. గతంలో ఆయన ఈ సినిమా గురించి, ఆయన ఎందుకు చేశాడో వివరించిన వీడియోను వైరల్ గా మార్చారు. ఇలాంటి పాత్రను స్టార్ హీరో ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఈ ఓల్డ్ వీడియోలో ఫహాద్ చెప్పుకొచ్చాడు.
Samantha: ఏంటి ఆ నిర్మాత దగ్గర సమంత అప్పు చేసిందా..?
పుష్ప తరువాత తన కెరీర్ లో ఎలాంటి మార్పు రాలేదని, తానేమి టాలీవుడ్ లో మ్యాజిక్ చేయడానికి రాలేదని చెప్పుకొచ్చాడు. ” పుష్ప తరువాత నాలో కానీ, నా కెరీర్ లో కానీ ఎలాంటి మార్పు లేదు. ఇందులో దాచుకోవడానికి ఏమి లేదు. కించపర్చాల్సిన ఉద్దేశ్యం ఏమి లేదు. దాని వలన నాకు వచ్చింది లేదు.. పోయింది లేదు. ఈ సినిమా తరువాత నేనేదో మ్యాజిక్ చేస్తాను అని ప్రేక్షకులు అనుకోవడం లేదు. నా దృష్టి అంతా మలయాళ సినిమాలపైనే ఉంది.
మలయాళం తెలియనివారు కూడా ఇప్పుడు మాలీవుడ్ సినిమాలవైపు చూస్తున్నారు. అది నాకు చాల సంతోషాన్నిస్తుంది. వారిని మెప్పించడానికి ఇంకా ప్రయత్నిస్తాను. పుష్ప కేవలం సుకుమార్ సార్ కోసమే చేశాను. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఆ వీడియో మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.
This interview excerpt from #FahadhFaasil hits differently now.#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/EP4xkR7wRZ
— Navaneeth (@Navaneeth_dir) December 5, 2024