BigTV English

Family Star: కళ్యాణి వచ్చా వచ్చా.. మృణాల్ కు అది సెట్ అవ్వలేదు

Family Star: కళ్యాణి వచ్చా వచ్చా.. మృణాల్ కు అది సెట్ అవ్వలేదు

 


Family star movie update

Family star movie update(Latest news in tollywood): విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ పెట్టి సినిమాపై హైప్ ను పెంచేస్తూన్నారు. మొదటి నుంచి కూడా ఈ చిత్రంపై ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు రెండు కారణాలు. ఒకటి.. గీతగోవిందం కాంబో రిపీట్ అవ్వడం.. విజయ్- పరుశురామ్- దిల్ రాజు కాంబోలో వచ్చిన గీతగోవిందం ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి ఈ కాంబో ఫ్యామిలీ స్టార్ సినిమాతో వస్తుంది.


ఇక రెండో కారణం మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సీతగా ముద్ర వేసేసుకుంది. ఈ సినిమా తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే హయ్ నాన్న సినిమాతో రెండో హిట్ అందుకున్న మృణాల్ కు ఫ్యామిలీ స్టార్ మూడో సినిమా. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎంచుకుంటున్న ఈమె.. ఈ సినిమా చేస్తుంది అంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే అన్న అభిప్రాయం అభిమానుల్లో ఎంతో కొంత ఉంది.

ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కళ్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే పెళ్లి సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా కళ్యాణి వచ్చా వచ్చా వీడియో సాంగ్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్- మృణాల్ డ్రీమ్ వెడ్డింగ్ సాంగ్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇకనుంచి ప్రతి పెళ్ళిలో ఈ సాంగ్ కచ్చితంగా వినపడుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ అందం.. విజయ్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ, కార్తీక్ ఆలపించారు. అయితే మంగ్లీ గింతు మృణాల్ కు సెట్ కాలేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఆమె బేస్ వాయిస్ కు మృణాల్ కూల్ డ్యాన్స్ కు సరిపడలేదని, ఆమె కాకుండా వేరే స్వీట్ వాయిస్ ఉన్న సింగర్ తో పాటిస్తే సాంగ్ ఇంకా అద్భుతంగా ఉండేదని అంటున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×