BigTV English

Chhattisgarh encounter: మళ్లీ కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter: మళ్లీ  కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter 4 maoists killed


Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.

ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనమిది మంది మావోలు మరణించారు. దాదాపు అరడజనుకు పైగా నక్సలైట్లు గాయపడినట్టు తెలుస్తోంది.


ఘటనాస్థలం నుంచి ఎల్‌ఎంజీ ఆటోమెటిక్ వెపన్స్, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. పారిపోయిన మావోల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడిచిన నాలుగునెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు మరణించారు. ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×