NTR: టాలీవుడ్ రేంజ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు గురించి చెప్పాలంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఒక తెలుగు హీరో గురించి ప్రపంచంలో ఎవరైనా చెప్పుకొస్తున్నారు. అంతలా టాలీవుడ్ మారింది. ముఖ్యంగా బాలీవుడ్ పై టాలీవుడ్ ఒక మెట్టు ఎక్కిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టాలీవుడ్.. బాలీవుడ్ లో పాగా వేయడానికి కష్టపడేది.
కానీ, ఇప్పుడు బాలీవుడ్ నే.. టాలీవుడ్ ముందు తలవంచుతుంది. అక్కడ నటించిన స్టార్ట్.. తెలుగులో ఎప్పుడెప్పుడు నటించాలా.. ? అని ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇంకా టాలీవుడ్ స్టార్స్ ను అవమానించడానికి ముందు ఉంటున్నారు. టాలీవుడ్ ఇంకా బాలీవుడ్ కిందనే ఉందని మాట్లాడుతున్నారు. ఈ మధ్య గలాటా ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నో వివాదాలకు తెరలేపింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ మధ్య పోటాపోటీ చర్చ జరిగిన విషయం తెల్సిందే.
Mohanlal: ‘బరోజ్’ మూవీకి ఫ్లాప్ టాక్.. మోహన్‌లాల్ షాకింగ్ రియాక్షన్
హిందీ సినిమాను ఎక్కువ చేసి తెలుగు సినిమాను తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారి నాగవంశీ ఇచ్చిపడేశాడు. ఆ సమయంలో కొద్దిగా ఘాటుగానే సమాధానాలు చెప్పుకొచ్చాడు నాగవంశీ. అయినా కూడా డిబేట్ అంటే ఆ మాత్రం ఉండాలి. అందులోనూ తమ భాషను, ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ మాత్రం ఘాటుగా మాట్లాడడంలో కూడా తప్పు లేదు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ డిబేట్ లో బోనీ కపూర్ తెలుగు సినిమా గురించి, హీరోల గురించి తక్కువగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ హీట్ డిస్కషన్ లో బోనీ కపూర్ ఎన్టీఆర్ ను కొత్త ముఖం అనేశాడు.
సిద్దార్థ్.. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ” ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీ.. కొత్త ముఖాన్ని అంటే హీరో..కొత్త డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమాలను ఆదరిస్తుంది” అని చెప్పగానే బోనీ కపూర్.. “అవును.. ఆదిత్య చోప్రా తన కొత్త సినిమాలో తారక్‌ని ఎందుకు తీసుకున్నాడు.. కొత్త ముఖం కాబట్టి తీసుకున్నాడు” అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే ఆ మాటకు నాగవంశీ.. ” ఎన్టీఆర్ కొత్త ముఖం కాదు” అని అన్నాడు.
Bhagyashree: సల్మాన్ ఖాన్ నాతో హద్దుమీరి అలా చేశాడు.. ప్రభాస్ రీల్ తల్లి సంచలన వ్యాఖ్యలు
ఇక సిద్దార్థ్ మాట్లాడుతూ.. ” ఎన్టీఆర్ కొత్త ముఖం కాదు. ఆయన బిగ్గెస్ట్ స్టార్. ఒక బిగ్ స్టార్ తో.. ఇంకో బిగ్ స్టార్ కలిసి.. ఇండియాలోనే పెద్ద నిర్మాత సినిమా చేస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. దీంతో బోనీ కొద్దిగా తగ్గాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ అన్న విషయం బోనీకి తెలియంది కాదు.
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత హిందీలో కూడా ఎన్టీఆర్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. అంతేనా బోనీ కుమార్తె జాన్వీ కపూర్.. గతేడాది ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని ఆఫర్స్ వచ్చినా వదులుకొని.. ఎన్టీఆర్ తోనే కలిసి నటించాలని జాన్వీ దేవుడ్ని మొక్కుకొని మరీ దేవర సినిమ చేసినట్లు తెలిపింది. ఆయన రేంజ్ నీ కూతురుని అడుగు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇన్ని తెలిసి.. బోనీ ఎన్టీఆర్ ను అంత మాట ఎలా అన్నాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అక్కడ అన్నావ్ కాబట్టి సరిపోయింది.. ఇక్కడ తెలుగులో కనుక ఇలాంటి మాట అంటే మాములుగా ఉండేది కాదు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.