Allu Aravindh:సినిమాలను థియేటర్ లో చూసే జనాల కంటే ఓటీటీ(OTT) లో చూసే జనాలు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఓటీటీలు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి థియేటర్లో మిస్ అయిన చాలామంది ఓటీటీ లో చూసుకుందాంలే అనుకుంటున్నారు. ఇక మరికొంత మంది థియేటర్ కి వెళ్లి రిస్క్ చేయడం ఎందుకు.. ? మరికొద్ది రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే.. అప్పుడు చూసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఇక అప్పట్లో నిర్మాతలు ఓటీటీ పైనే భారమంతా వేసి సినిమాలు తీసేవారు. అధిక లాభాలు ఆర్జించేవారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాతలు సినిమాలు తీయాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీని ఓటీటీలే ఏలుతున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ వాళ్ళు ఏది చెబితే అది అన్నట్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టిన కండిషన్లకు ఓకే చెబితేనే వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు సైతం ఓటీటీ ప్లాట్ఫారం వాళ్లు ఏది చెప్తే దానికే తలొగ్గుతున్నారు. ఒకప్పుడు సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఆ సినిమా షూటింగ్ కి ముందే ఓటీటీ (OTT) వాళ్లు భారీ డీలింగ్ మాట్లాడుకునేవారు.
ఓటీటీల వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతోందా..?
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఒక సినిమా విడుదలవుతుందంటే.. ఆ సినిమాకి బడ్జెట్ పెట్టే నిర్మాత.. అసలు ప్రేక్షకులకు ఈ సినిమా ఏ విధంగా నచ్చుతుంది..ఓటిటి వాళ్లు తమ సినిమాని ఎంత డీలింగ్ కి కొనుగోలు చేస్తారో అనే అయోమయంలో పడిపోయారు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అధినేతలు కూడా చాలా తెలివిగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలకు ఎంత బజ్ ఉంటే అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒకవేళ సినిమాకి బజ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయడానికి అస్సలు ముందుకు రావడం లేదు. అలా సినీ ప్రేక్షకులు ఏ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే, ఆ సినిమాని కొనడానికి ముందుకు వస్తున్నారు. ఇక అప్పట్లో సినిమాలు తీసే నిర్మాతలు చాలామంది ఓటీటీ ద్వారానే సగానికి పైగా పెట్టిన బడ్జెట్ వస్తుంది అని నమ్మేవారు.కానీ ఇప్పుడు ఓటీటీలపై భారం వేసి నిర్మాతలు సినిమాలు తెరకెక్కిస్తే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే సినిమా బజ్ లేకపోతే థియేటర్లోనే కాదు ఓటిటి వాళ్లు కూడా కొనడానికి ముందు రారు. ఎందుకంటే ఫ్లాప్ సినిమాని కొనుగోలు చేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు. అందుకే ఓటిటి ప్లాట్ఫామ్స్ కూడా సినిమా రైట్స్ ని కొనుగోలు చేసే విషయంలో ఎన్నో ఆలోచించి కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలు తీస్తే ఓటీటీల ద్వారా నిర్మాతలకు భారీ లాభం వచ్చేది.కానీ ఇప్పుడు విడుదలయ్యే సినిమాలు అన్నింటినీ కూడా ఓటీటీలు ఒకే విధంగా చూస్తున్నాయి. అది పాన్ ఇండియా సినిమానా.. చిన్న సినిమానా అని చూడడం లేదు.బజ్ బాగుంటే సినిమాను కొనుగోలు చేస్తున్నారు.
ఓటీటీ లదే రాజ్యం అయిపోయింది..
ఇక సినిమా విడుదల చేయాలంటే ఆ విడుదల డేట్ పూర్తిగా నిర్మాత, దర్శకుడు, హీరోలే నిర్ణయించుకుంటారు.కానీ రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఓటిటిల ప్లాట్ఫామ్ వాళ్ళు చెప్పిందే విన్నారట. వాళ్లు రిలీజ్ చేయమన్న డేట్ కే సినిమాని థియేటర్లో రిలీజ్ చేశారట. అలా సినీ ఇండస్ట్రీని ఓటీటీ శాసిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ (Allu Aravind) కూడా ఓటీటీలను నమ్ముకొని నిర్మాతలు సినిమాలు తీసి నష్టపోకూడదని చెప్పారు. అంతేకాదు” ఒకప్పుడు సినిమాకి బడ్జెట్ పెట్టే నిర్మాత సగం డబ్బులు ఓటిటిలోనే వస్తాయని ధైర్యంతో తీసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలకు మార్కెట్ లేకపోవడం వల్ల విడుదలైన సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ కి నోచుకోవడం లేదు. అందుకే సినిమాకి పెట్టే బడ్జెట్ విషయంలో నిర్మాత కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది అని” అల్లు అరవింద్ ఈ మధ్య ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే సినిమాకి బడ్జెట్ పెట్టేముందు నిర్మాతలు కాస్త ఆలోచన చేయాలని ఓటీటీలను నమ్ముకొని సినిమాలు తీయకూడదు అని అంటున్నారు.