Big Stories

Filmmaker Sangeeth Sivan Dies: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు మృతి!

Filmmaker and Director Sangeeth Sivan Passed Away: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సినీ నిర్మాత, దర్శకుడు సంగీత్ శివన్ తుది శ్వాస విడిచారు. అతని మరణ వార్తను సంగీత్ శివన్ సోదరుడు సంజీవ్ శివన్ వెల్లడించారు. సంగీత్ శివన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో యూరినరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

అయితే దురదృష్టవశాత్తు బుధవారం ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారని అతని సోదరుడు సంజీవ్ శివన్ తెలిపాడు. సంగీత్ శివన్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతడి మరణంపై పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

- Advertisement -

ఈ మేరకు చిత్రనిర్మాత మరణం గురించి తెలుసుకున్న అనంతరం ‘యమ్లా పగ్లా దీవానా 2’లో సంగీత్ శివన్‌తో కలిసి పనిచేసిన నటుడు సన్నీ డియోల్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘నా ప్రియ మిత్రుడు సంగీత్ శివన్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. నువ్వు ఇక మా మధ్య లేవని నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు మా హృదయాలలో, జ్ఞాపకాలలో ఎప్పటికీ మాతోనే ఉంటారు. ఓం శాంతి నా మిత్రమా.. నీ కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలి’’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అలాగే నటుడు రితీష్ దేశ్‌ముఖ్ కూడా సంగీత్ శివన్ జ్ఞాపకార్థం ఎమోషనల్ నోట్ రాశారు.

Also Read: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్టార్ నటుడు మృతి

రితీష్ నటించిన ‘అప్నా సప్నా మనీ మనీ’, ‘క్యా కూల్ హై హమ్’ చిత్రాలకు సంగీత్ శివన్ దర్శకత్వం వహించారు. అలాగే తుషార్ కపూర్ కూడా సంగీత్ శివన్‌కు నివాళులర్పించారు. కామెడీ సినిమాల్లో తనను పరిచయం చేసిన సంగీత్‌కి ధన్యవాదాలు అని తెలిపారు. ‘‘ప్రస్తుతం నా అనుభూతిని వర్ణించడానికి పదాలు లేవు. ఒక రకమైన గురువు, ‘క్యా కూల్ హై హమ్‌’తో కామెడీకి నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఇక లేరు. సంగీత్ జీ, ఇటీవల మీతో కలిసి పనిచేసిన ఘనత నాకు దక్కింది. ఈ విచారకరమైన వార్తను పొందడానికి నాకు చాలా సమయం పడుతుంది సార్’’ అంటూ రాసుకొచ్చాడు.

అయితే సంగీత్ శివన్ మరెవరో కాదు.. ఫోటోగ్రాఫర్-సినిమాటోగ్రాఫర్ శివన్ పెద్ద కుమారుడు. అతడికి భార్య జయశ్రీ, పిల్లలు సంజన, శంతను ఉన్నారు. కాగా సంగీత్ కేరళలోని తిరువనంతపురం నుండి వచ్చాడు. 1989లో అమీర్ ఖాన్ నటించిన రఖ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అతను సినిమాల్లోకి ప్రవేశించాడు.

Also Read: Aavesham: ఆవేశం తెలుగు రీమేక్.. చేసేదెవరు.. ?

అతని మొదటి చిత్రం 1990లో మలయాళం రఘువరన్-నటించిన వ్యుహం. అప్పటి నుండి, అతను బ్లాక్ బస్టర్ చిత్రాలకు నాయకత్వం వహించాడు. మోహన్ లాల్ యోధ, గంధర్వం, నిర్ణయం వంటి సినిమాలు తీశాడు. మలయాళంతో పాటు, అతను హిందీలో జోర్, క్యా కూల్ హై హమ్, అప్నా సప్నా మనీ మనీ, యమ్లా పగ్లా దీవానా 2 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతని చివరి దర్శకత్వం 2019లో కల్కి కోచ్లిన్, భూమికా చావ్లా వెబ్ సిరీస్ భ్రమ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News