Bollywood:ప్రముఖ సోషల్ మీడియా సంచలనం ఓర్రీ(Orry )(ఓర్హాన్ అవ్రతమణి ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఇతడిని కలవాలని, ఇతడితో ఫోటో దిగాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. అంత పాపులారిటీ దక్కించుకున్న ఇతడిపై తాజాగా జమ్మూకాశ్మీర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇతనితో పాటు మరో ఏడుగురిపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బీఎఫ్ఎఫ్ ఓర్రీ పవిత్ర దేవాలయం అయిన వైష్ణో దేవి మందిరం సమీపంలో మద్యం సేవించినందుకుగాను జమ్మూకాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓర్రీ పై కేస్ ఫైల్..
ముఖ్యంగా వైష్ణో దేవి మాత దేవాలయం జమ్మూకాశ్మీర్ లోని కాత్రాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మద్యం సేవించడం, మాంసాహారం తినడం నిషేధం. అలాంటి ప్రాంతంలో ఓర్రీ తన ఏడు మంది సన్నిహితులతో కలిసి మద్యం సేవించడంతో ఈ విషయం పోలీసుల వరకు చేరగా.. రంగంలోకి దిగిన పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ (No.72/25) నమోదు చేశారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు అలాగే మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ వారిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇక ఎఫ్ఐఆర్ ఫైల్ లో ఓర్రీ తోపాటు అతని స్నేహితులు రష్యన్ జాతీయురాలు అనస్తాసిలా అర్జామస్కినా, దర్శన్ సింగ్, పార్థ్ రైనా, రితిక్ సింగ్, రాశి దత్త, షాగున్ కోహ్లీ, రక్షిత భోగల్ తోపాటు అర్జా మస్కినా లను ప్రాథమిక నిందితులుగా పేర్కొన్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇకపోతే హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటైన వైష్ణో దేవి మందిరానికి సమీపంలోని ఒక హోటల్లో వీరు మాంసాహారం తో పాటు మత్తు పదార్థాలు సేవించడం పై కేసు ఫైల్ చేశారు.
స్పందించిన ఎస్పీ రియాజ్..
ఇకపోతే ఈ విషయంపై స్పందించిన. ఎస్పీ..” కాత్రాతో పాటు కాత్రా సమీపంలో ఎవరైనా మద్యం సేవించడం, మాంసాహారం తినడం లాంటివి చేస్తే కచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అంటూ తెలిపారు. మొత్తానికైతే ఓర్రీతో పాటు మరో 7 మందిపై ఇప్పుడు కేస్ ఫైల్ అయింది. ఇక దీనిపై ఓర్రీ ఎలాంటి కామెంట్ చేస్తారో చూడాలి.
ఓరి కెరియర్..
కంటెంట్ సృష్టికర్తగా పేరు దక్కించుకున్న ఈయన.. సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయారు. బాలీవుడ్ తారలతో ఆయనకున్న సాన్నిహిత్యానికి ప్రసిద్ధి చెందారు. ముంబై వాసి అయిన ఈయన ఎక్కువగా బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ సెలబ్రిటీలను ఆకర్షిస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ బ్యూటీలైన జాన్వీ కపూర్(Janhvi Kapoor) ,అనన్య పాండే(Ananya Pande), భూమి పడ్నేకర్ (Bhoomi Padnekar) ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) వంటి ,తారాలతో సన్నిహితంగా ఉంటూ .mవారితో కలిసి ఈవెంట్లకు వెళుతూ ఉంటారు. అంతేకాదు వీరితో కలిసి పబ్బులు, పార్టీలకు వెళ్లి సంచలనం సృష్టిస్తూ ఉంటారు. ఇక తెలుగు సెలబ్రిటీలైన సురేఖ వాణి (Surekha Vani) , సుప్రీతా (Supreetha ) వంటి సెలబ్రిటీస్ తో కూడా ఈయన సందడి చేసిన విషయం తెలిసిందే.
Star Hero:క్యాన్సర్ తో బాధపడుతున్న మెగాస్టార్..ఎట్టకేలకు స్పందించిన టీమ్..!