BigTV English

Chhaava: ‘ఛావా’ చూస్తుండగా థియేటర్‌లో మంటలు.. ఎక్కడంటే.?

Chhaava: ‘ఛావా’ చూస్తుండగా థియేటర్‌లో మంటలు.. ఎక్కడంటే.?

Chhaava: థియేటర్ యాజమాన్యం అనేది ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతీ షో చూడడానికి ఎన్నో వందల మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు. అలాంటప్పుడు యాజమాన్యం మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ తాజాగా ఢిల్లీలోని సెలక్ట్ సిటీ మాల్‌లో ప్రేక్షకులు థియేటర్‌లో ఉండి సినిమా చూస్తుండగానే అగ్నిప్రమాదం జరగడంతో అందరిలో ఒక్కసారిగా ఆందోళన మొదలయ్యింది. సెలక్ట్ సిటీ మాల్‌లో ఉన్న పీవీఆర్ సినిమాస్‌లో సాయంత్రం 4.15 గంటలకు ‘ఛావా’ సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రాగానే ఈ ప్రయాదం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వెంటనే అలర్ట్ అయ్యారు

అందరూ థియేటర్లలో ‘ఛావా’ (Chhaava) సినిమా చూస్తున్న సమయంలోనే అగ్నిప్రమాదం జరగడంతో వెంటనే అందరినీ ఎగ్జిట్ డోర్ నుండి బయటికి పంపించేసింది యాజమాన్యం. అలా వెంటనే థియేటర్‌ను ఖాళీ చేయించారు. ప్రస్తుతానికి ఈ అగ్నిప్రమాదం వల్ల ఎవరికీ ఏ ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అగ్నిప్రమాదం మొదలవ్వగానే ఫైర్ అలార్మ్ మోగడంతో వెంటనే అక్కడ ఉన్నవారంతా అలర్ట్ అయ్యారని ఒక ప్రేక్షకుడు చెప్పుకొచ్చాడు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించింది మాల్ యాజమాన్యం. దీంతో వారు కూడా వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని థియేటర్, మాల్ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా ప్రకటించారు. కానీ అప్పటికే ఈ విషయం సోషల్ మీడియా అంతటా వైరల్ అయిపోయింది.


అదుపులోకి మంటలు

సాయంత్రం సుమారు 5.42 గంటలకు తమ కాల్ వచ్చిందని, దీంతో వారు వెంటనే మంటలను అదుపు చేయడానికి మాల్‌కు చేరుకున్నారని చెప్పుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. కానీ అది చిన్న మంటే కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. దాదాపు సాయంత్రం 5.55 నిమిషాల లోపు మంటలను అదుపులోకి తీసుకొచ్చింది సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసులకు కూడా సమాచారం అందించింది మాల్ యాజమాన్యం. దీంతో మంటలు అదుపు అయిన తర్వాత.. అంటే దాదాపు సాయంత్రం 5.57 నిమిషాలకు ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: అమితాబ్ కోసం హేమ మాలిని అలాంటి నిర్ణయం.. షాక్‌లో మేకర్స్

మంటల్లో చిక్కుకుపోయారు

‘‘మాకు అగ్నిప్రమాదం జరిగినట్టుగా కాల్ వచ్చింది. కొందరు థియేటర్లలో మంటల్లో చిక్కుకుపోయారని కాలర్ చెప్పారు. అందుకే టీమ్ వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు’’ అంటూ పోలీసులు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రేక్షకులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూస్తుండగా.. ఇలా అగ్నిప్రమాదాలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పటికే ఎన్నో థియేటర్లలో ఇలా జరిగినా కూడా పలు థియేటర్ యాజమాన్యాలు మాత్రం వీటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలావరకు ప్రాణనష్టం జరగడం లేదు కాబట్టి లైట్ తీసుకుంటున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×