CM Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన వ్యాపార భాగస్వామి కేదార్ మృతిపై కేటీఆర్ అసలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.తెలంగాణలో మూడు అనుమానాస్పద మరణాలు జరగాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ALSO READ: CM Revanth Reddy: ఇదంతా కిషన్ రెడ్డే చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరంపై కేసు వేసిన రాజలింగమూర్తి, వాదిస్తున్న సంజీవ్ రెడ్డి, ఇప్పుడు కేదార్ అనుమానస్పదంగా మృతి చెందారని.. ఈ మరణాలపై కేటీఆర్ అసలు ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. వీటిపై ఫిర్యాదు కనుక వస్తే ప్రభుత్వం తప్పకుండా విచారణ జరుపుతోందని సీఎం అన్నారు. ప్రతి ఇష్యూపై స్పందించే కేటీఆర్ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై వాదించిన లాయర్ సంజీవ్ రెడ్డి కూడా మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ ముగ్గురు మృతిచెందడంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం తప్పకుండా విచారిస్తోందని అన్నారు. గతంలో కేటీఆర్ కు వ్యాపార భాగస్వామిగా ఉన్న కేదార్ కు డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే కేదారి అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడంతోనే మృతి చెందినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కేదార్ మృతిచెందినప్పుడు పక్కనే ఓ తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దుబాయిలో కేదార్ మరణ వెనుక ఓ పెద్ద మిస్టరీనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ రాజకీయ ప్రముఖుడు ఇచ్చిన డ్రగ్స్ పార్టీ రాడిసన్ హోటల్ లో జరిగిందని… అందులో కేదార్ కూడా ఉన్నారని సీఎం చెప్పారు.
‘ప్రధాన కేసుల్లో ఉన్న వారు ఇలా వరుసగా మృతిచెందడం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి..? దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ జరిపిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు, టాలీవుడ్‌లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని గతంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు కేదార్ మృతిచెందడం, అది కూడా దుబాయిలో.. ఈ మరణాల వెనుక అసలు కారణాలేంటో పెద్ద చర్చే జరుగుతోంది.
ALSO READ: Assam Rifles Recruitment: టెన్త్, ఐటీఐ, పాలిటెక్నిక్ అర్హతలతో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే..
తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులతో కేదార్‌కు మంచి సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేదార్ టాలీవుడ్ లో పెద్ద సినిమాలు నిర్మించలేదు. ఒకట్రెండు చిత్రాలకు మాత్రమే ఆయన నిర్మాతగా వ్యవహరించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విజయ దేవరకొండతో ఆయనకు మంచి సన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. దుబాయిలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరైన కేదార్.. తనకు కేటాయించిన రూంకి వెళ్లి నిద్రపోయారు. ఆ నిద్రలోనే ఆయన మృతిచెందారు. అయితే ఈక్రమంలోనే కేదార్ తో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు సమాచారం. ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశించారు. ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయి పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.