MI VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా.. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Mumbai Indians vs Kolkata Knight Riders ) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ముంబైలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Wankhede Stadium, Mumbai ) వేదికగా…. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉండనుంది. మరికాసేపట్లోనే ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… కాసేపటికి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్… మొదట బౌలింగ్ చేయాలని… నిర్ణయం తీసుకుంది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతుంది.
Also Read: Rayudu on Rahul Dravid: వీల్ చైర్ పై ద్రావిడ్… అంబటి రాయుడు హాట్ కామెంట్స్ ?
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య పై ద్రుష్టి
ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అలాగే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటివరకు ఈ ఇద్దరూ పెద్దగా పెర్ఫార్మన్స్ చూపించలేదు. రోహిత్ శర్మ అయితే అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్లు ఆడితే మూడు మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ తేలిపోయాడు. అటు హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ ఆడి పెద్దగా రాణించలేదు. దానికి తోడు స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానా బారిన కూడా పడ్డాడు హార్థిక్ పాండ్యా.
ఒక్క మ్యాచ్ గెలవని ముంబై ఇండియన్స్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడితే.. రెండు మ్యాచ్లో కూడా దారుణంగా విఫలమైంది ముంబై ఇండియన్స్. మొదట చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోతే రెండవ మ్యాచ్ గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ఇక ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పైన గెలిస్తేనే… ఆ జట్టుకు మంచి అవకాశాలు ఉంటాయి. పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ చిట్ట చివరన ఉంది. కాబట్టి ఇవాళ కచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలవాలి.
Also Read: HCA – SRH: HCA-SRH పంచాయతీ…. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (సి), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్