BigTV English

Game Changer Teaser: టీజర్ అదిరిపోయిందంట.. దివాళీ బ్లాస్టేరోయ్

Game Changer Teaser: టీజర్ అదిరిపోయిందంట.. దివాళీ బ్లాస్టేరోయ్

Game Changer Teaser: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. మరికొన్ని రోజుల్లో నెరవవెరబోతుంది అని మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అంతగా సంబురాలు చేసుకొనే  వార్త ఏంటి అంటే.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ టీజర్ రాబోతుంది.  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు.


ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,  సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  అయితే టీజర్ ఎప్పుడు  వస్తుందా..? అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక వారికి గుడ్ న్యూస్.  దీపావళీ కానుకగా గేమ్ ఛేంజర్  టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు  సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.  ఇప్పటికే గేమ్ ఛేంజర్ టీజర్ ను కట్  చేసేశారట. ఆ టీజర్ కట్ చూసిన టెక్నీషియన్స్..  నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పారని టాక్ నడుస్తోంది. దీంతో ఈ టీజర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Naga Vamsi About Nbk109: ఎన్ని అంచనాలు పెట్టుకున్న వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది


ఇక ఈ చిత్రంలో చరణ్.. తండ్రికొడుకుల పాత్రల్లో కనిపించనున్నాడు.  చాలా గ్యాప్ తరువాత  చరణ్ డబుల్ రోల్ చేయడంతో అందరు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పండుగరోజు ఈ టీజర్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతుందని చెప్పుకొస్తున్నారు.

గేమ్ ఛేంజర్  సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో.. అన్నే అనుమానాలు కూడా ఉన్నాయి.   ఆర్ఆర్ఆర్ తరువాత  చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్.  రాజమౌళి సెంటిమెంట్.. చరణ్ కు కూడా వర్తిస్తుంది. దేవరతో ఎన్టీఆర్ గట్టెక్కాడు.. కాబట్టి  ఆ సెంటిమెంట్ చరణ్ వైపు దూసుకొస్తుందని అంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే శంకర్.. భారతీయుడు 2  సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఆ ఎఫెక్ట్  ఈ సినిమాపై బాగా గట్టిగా పడింది.

Bagheera: థియేటర్ కు వెళ్ళడానికి ఈ ఒక్క సాంగ్ చాలు మావా.. ఎంత బావుంది

ఇప్పుడు గేమ్ ఛేంజర్  టీజర్  కనుక మంచి హైప్ ఇస్తే..  అనుమానాలకు ఫుల్ స్టాప్ పడి.. అంచనాలను ఇంకా పెంచుతుంది. ఒకవేళ ఈ టీజర్ కూడా తుస్సుమన్నది అంటే.. ఇక గేమ్ ఛేంజర్  ను కాపాడడం కష్టమే అని చెప్పాలి. సాంగ్స్, విజువల్స్, చరణ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కథను శంకర్ మలిచిన తీరు ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పటివరకు ఈ సినిమా ఈ ఏడాది వస్తుంది అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో సంక్రాంతి రేసులో  దించారు. జనవరి 10 న గేమ్ ఛేంజర్ రిలీజ్ కు రెడీ అవుతుంది.  మరి ఈ సినిమాతో  చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×