BigTV English

Srisailam dam gates closed: శ్రీశైలం డ్యామ్ గేట్స్ క్లోజ్, వెంటనే వేట మొదలు..

Srisailam dam gates closed: శ్రీశైలం డ్యామ్ గేట్స్ క్లోజ్, వెంటనే వేట మొదలు..

Srisailam dam gates closed(AP news today telugu): సందట్లో సడేమియా అంటే ఇదేనేమో.. నీటిని చూస్తే గంగ పుత్రులకు ఆనందం అంతా ఇంతా కాదు. డ్యాములు.. నదులు .. సముద్రాలు ఏవైనా కావచ్చు. నీటి పెరిగితే తమకు సంపద పెరుగుతుందని భావిస్తుంటారు.. నమ్ముతారు కూడా. తాజాగా శ్రీశైలం డ్యామ్‌ దిగువన అదే చేశారు.


ఎగువ రాష్ట్రాల నుంచి వరద నీరు తగ్గుముఖం క్రమంగా పడుతోంది. అవుట్ ఫ్లో కంటే ఇన్‌ఫ్లో భారీగా తగ్గింది. దీంతో శ్రీశైలం డ్యామ్ అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. జలాశ్రయం గేట్లన్నీ మూసి వేయడంతో మత్య్సకారులు రంగంలోకి దిగేశారు. చేపలు పట్టేందుకు పడవలతో ఎంట్రీ ఇచ్చేశారు. సినిమా షూటింగ్ తరహాలో వీరంతా బోట్లపై రావడంతో ఆ సన్నివేశాన్ని చూసి ఎంజాయ్ చేయడం సందర్శకుల వంతైంది.

మత్య్సకారులు చిన్నచిన్న బోట్లతో శ్రీశైలం డ్యామ్ దిగువన గుంపులు గుంపులుగా చేపల వేటకు వచ్చారు. గుంపులుగా ఉండటాన్ని చూసి ఎంజాయ్ చేశారు టూరిస్టులు. ఈ తరహా సన్నివేశాలు ఫెస్టివల్ సమయం లో కేరళలో మాత్రమే కనిపిస్తాయని అంటున్నారు. ఈ విధంగా తాము ఎప్పుడూ చూడలేదన్నది మరి కొందరి మాట.


ALSO READ: విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన రెస్టారెంట్

కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎగువన ప్రాజెక్టులకు జల కళ సంత రించుకుంది. దీనికితోడు వరద పోటెత్తడంతో నీటిని కిందకు వదిలారు. నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం ఆగిపోవడంతో సోమవారం రాత్రి శ్రీశైలం గేట్లను పూర్తిగా క్లోజ్ చేశారు అధికారులు.

గతంలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో చేపల వేట వద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గేట్లన్నీ మూసివేయడంతో మత్య్సకారులు రంగంలోకి దిగేశారు. ఈ దృశ్యాలను తమ ఫోన్లలో  బంధించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×