KKR VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) గత మూడు రోజుల కిందట ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొన్నటి నుంచి ఇవాల్టి వరకు… ఐదు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ ఐదు మ్యాచ్లు కూడా చాలా రసవత్తరంగా కొనసాగాయి. ఇక ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. దింతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. గౌహతి వేదికగా కాసేపట్లో రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: Rishabh Pant: డకౌట్ తో కూడా పంత్ కోట్లు.. ఒక్క మ్యాచ్‌కు ఎంతంటే ?
వేదిక, ఉచితంగా ఎలా చూడాలి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Rajasthan Royals vs Kolkata Knight Riders ) జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ గౌహతి లోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముఖ్యగా ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ ను జియో హాట్ స్టార్ లో మనం ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్లు వస్తున్నాయి. జియో కస్టమర్ లందరికీ… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఉచితంగానే అందిస్తోంది రిలయన్స్ కంపెనీ. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్లు జరిగాయి. ఈ 30 మ్యాచ్ల్లో రెండు సమానంగా విజయం సాధించాయి. 14 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే… కోల్కత్తా రైడర్స్ జట్టు కూడా 14 మ్యాచ్లో విజయం సాధించడం జరిగింది. రెండు మ్యాచ్లో ఫలితం రాలేదు.
Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్… టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !
రాజస్థాన్ రాయల్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల వివరాలు ఇవే
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ (సి), నితీష్ రాణా, ధ్రువ్ జురెల్ (వికె), షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఎఫ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XII: క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, అజింక్యా రహానే (సి), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/ఆన్రిచ్ నార్త్జే, వరుణ్ చకరవరోరా, వరుణ్ చకరవరోరా