BigTV English

Viswam OTT: విడుదలకు ముందే ఓటీటీ డీల్ లాక్ చేసుకున్న ‘విశ్వం’.. గోపీచంద్ క్రేజ్ ఇంకా తగ్గలేదు!

Viswam OTT: విడుదలకు ముందే ఓటీటీ డీల్ లాక్ చేసుకున్న ‘విశ్వం’.. గోపీచంద్ క్రేజ్ ఇంకా తగ్గలేదు!

Viswam OTT: మాచో హీరో గోపీచంద్, కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి చేసిన చిత్రమే ‘విశ్వం’. ప్రస్తుతం అటు గోపీచంద్‌కు, ఇటు శ్రీను వైట్లకు ఇద్దరికీ చాలాకాలంగా హిట్స్ లేవు. ఒక్క హిట్ పడితే గానీ వీళ్లిద్దరూ మళ్లీ ట్రాక్‌లోకి రారు. అందుకే వీరి ఆశలన్నీ ‘విశ్వం’పైనే ఉన్నాయి. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. అక్టోబర్ 11 నుండి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అయితే గోపీచంద్ ప్రస్తుతం హిట్లు లేక డీలా పడినా.. ‘విశ్వం’ మాత్రం అప్పుడే ఓటీటీ డీల్‌ను లాక్ చేసేసుకుంది. దీంతో గోపీచంద్ క్రేజ్ ఇంకా తగ్గలేదు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


కామెడీతో పాటు యాక్షన్

చాలాకాలంగా గోపీచంద్, శ్రీను వైట్లకు హిట్స్ లేవు. అయినా కూడా ‘విశ్వం’కు భారీ బడ్జెట్‌ను అందిండంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తూ.. ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకటిగా ఎదిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అదే విధంగా ‘విశ్వం’ కూడా హిట్ అవుతుందని టీజీ విశ్వప్రసాద్ నమ్మారు. అందుకే ఈ సినిమాకు కావాల్సిన దానికంటే ఎక్కువ బడ్జెట్‌నే కేటాయించారు. ‘విశ్వం’.. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా కూడా ఇందులో యాక్షన్ కూడా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ యాక్షన్ సీన్స్ కోసమే మూవీ టీమ్ చాలా ఖర్చుపెట్టిందని సమాచారం.


Also Read: కన్ఫ్యూజింగ్ సంక్రాంతి 2025.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అంతా అయోమయం, గందరగోళం!

సగం లాభం

తెలుగులో మాత్రమే కాదు.. హిందీలో కూడా ‘విశ్వం’ కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్.. రూ.12 కోట్లు అమ్ముడుపోయాయంటేనే గోపీచంద్ క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్‌తో పాటు ఓటీటీ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే హిందీ డబ్బింగ్ రైట్స్, ఓటీటీ రైట్స్‌తోనే సగం వరకు బడ్జెట్‌ను రాబట్టింది ‘విశ్వం’. కానీ సినిమా లాభాల్లోకి వెళ్లాలంటే మాత్రం మొదటి రోజే దీనికి పాజిటివ్ టాక్ రావాలి. ఇప్పటికే ‘విశ్వం’ ప్రేక్షకులకు మరింత రీచ్ అవ్వడం కోసం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తోంది మూవీ టీమ్.

విమర్శలపై స్పందన

‘విశ్వం’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యి ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంది. ముఖ్యంగా విజువల్స్ అయితే చాలామందిని ఆకట్టుకున్నాయి. దీంతో ఫార్మ్‌లో లేని హీరోకు, దర్శకుడికి అంత బడ్జెట్ కేటాయించడం అవసరమా అని నిర్మాతలపై విమర్శలు వినిపించాయి. దానికి శ్రీను వైట్ల రియాక్ట్ అయ్యారు. ‘‘నా దగ్గర ఉన్న ఎక్స్‌పీరియన్స్, టెక్నీషియన్స్‌ను చూసి విశ్వంకు అంత బడ్జెట్ పెట్టారు. మేము సినిమాను భారీ ఎత్తున నిర్మించాం. అదంతా ప్రీ ప్రొడక్షన్‌లో పక్కాగా ఉండడం వల్లే సాధ్యమయ్యింది’’ అంటూ నెగిటివ్ కామెంట్స్‌పై కూడా పాజిటివ్‌గా స్పందించారు శ్రీను వైట్ల. ‘విశ్వం’లో గోపీచంద్‌కు జోడీగా కావ్య థాపర్ నటించింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×