BigTV English

PVCU3 : ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో కొత్త ప్రాజెక్ట్… మోక్షజ్ఞ ను పక్కన పెట్టాడా?

PVCU3 : ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో కొత్త ప్రాజెక్ట్… మోక్షజ్ఞ ను పక్కన పెట్టాడా?

PVCU3 : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ తో తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారారు. తాజాగా ఆయన ఈ యూనివర్స్ లో మరో కొత్త సినిమా రాబోతోంది అన్న క్రేజీ అప్డేట్ ని ఇచ్చారు. మరి ఆ విషయం ఏంటో చూసేద్దాం పదండి.


ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ లో మూడో మూవీ…

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒకే ఒక్క మూవీ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఓవర్ నైట్ పాపులారిటీని సంపాదించుకున్న ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి హీరోలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు. ‘హనుమాన్’ మూవీ థియేటర్లలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసి మూవీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందన్న హామీ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తన సినీమాటిక్ యూనివర్స్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 10 న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతోందంటూ ప్రకటించిన ప్రశాంత్ వర్మ 24 సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో పెద్దగా డీటెయిల్స్ ఏమీ లేనప్పటికీ ఈ నవరాత్రికి శక్తి మాయాజాలాన్నీ చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ తన సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? నటీనటులు ఎవరు అన్న విషయాన్ని అక్టోబర్ 10న ఆయన అనౌన్స్ చేసేదాకా వెయిట్ అండ్ సీ.


నందమూరి వారసుడిని పక్కన పెట్టేశాడా? 

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతుల్లో ‘జై హనుమాన్’ మాత్రమే కాకుండా తాజాగా ప్రకటించిన ఒక కొత్త ప్రాజెక్ట్, అలాగే నందమూరి వారసుడైన మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యత కూడా ఉంది. కానీ మోక్షజ్ఞ సినిమా ఇంకా పట్టాలు ఎక్కక ముందే ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ నుంచి మూడో సినిమా రాబోతుందని ప్రకటించడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రశాంత్ వర్మ రీసెంట్ గా మోక్షజ్ఞ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే సినిమా స్క్రిప్ట్ ఇంకా పెండింగ్ దశలో ఉందని, ఫస్ట్ లుక్ ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి రిలీజ్ చేశారని టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమాను అనౌన్స్ చేయడంతో మోక్షజ్ఞ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసాడా? అసలేం జరిగింది? అనే విషయంపై చర్చ నడుస్తోంది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×