BigTV English

Hanuman Trailer: “హనుమాన్” ఆగమనం అదుర్స్.. BGMతో గూస్ బంప్స్

Hanuman Trailer: “హనుమాన్” ఆగమనం అదుర్స్.. BGMతో గూస్ బంప్స్
Hanuman Trailer update

Hanuman Trailer update(Telugu film news):

తేజ సజ్జ హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా హనుమాన్. అంతా పక్కా ప్లాన్ తో జరిగి ఉంటే.. ఈ సమయానికి సినిమానే విడుదలవ్వాల్సింది. కానీ.. కొన్ని కారణాల వల్ల హనుమాన్ సినిమాను సంక్రాంతి బరిలో నిలబెడుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మొత్తం 11 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న హనుమాన్ ను విడుదల చేయనున్నారు. శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ ఇలా అనేక దేశాల్లో హనుమాన్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


తాజాగా రిలీజైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఒక పల్లెటూళ్లో ఉండే తేజ సజ్జకి అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరోవైపు విలన్ దేని కోసమో శక్తి సామర్థ్యాల కోసం ప్రయత్నిస్తుంటాడు. హీరో గురించి తెలిసి.. అతనిపై దాడి చేయగా.. ఆ తర్వాత ఏం జరిగింది ? హనుమంతుడు ఎలా కాపాడాడు అనే సస్పెన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ బీజీఎం వింటే గూస్ బంప్స్ రావాల్సింది. షాట్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెరపై హనుమంతుడు ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలంటే.. సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే.

.

.

Tags

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×