BigTV English

Virat Kohli Emotional: చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన కోహ్లీ..రాత్రంతా కప్ తోనే నిద్ర

Virat Kohli Emotional: చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన కోహ్లీ..రాత్రంతా కప్ తోనే నిద్ర

Virat Kohli Emotional:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… 18వ టైటిల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ పైన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. చివరి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 గవర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పంజాబ్ కింగ్స్ పోరాడినప్పటికీ కూడా… మ్యాచ్ మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచింది. దీంతో తొలిసారిగా ఛాంపియన్ గా నిలిచింది బెంగుళూరు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.


ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే

గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో… గ్రౌండ్ లోనే కుప్పకూలాడు విరాట్ కోహ్లీ. గ్రౌండ్ లోనే మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. 18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా అవతరించడంతో… తన ఎమోషనల్ ఫీలింగ్స్ ఆపుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ. కన్నీళ్లు పెడుతూ.. తన సెలబ్రేషన్స్ కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ కూడా రావడంతో… వాళ్లతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

అనుష్క శర్మతో సెలబ్రేషన్స్

గ్రౌండ్ నుంచి నేరుగా అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి… ఆమెతో కలిసి కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అనుష్క శర్మకు టైట్ హాగ్ ఇచ్చి… రచ్చ చేశాడు. ఆమెకు హాగ్ ఇచ్చి గ్రౌండ్లోకి తీసుకువచ్చాడు. అందరితో కలిసి అనుష్క శర్మ అలాగే విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

విరాట్ కోహ్లీ భావోద్వేగం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… 18వ టైటిల్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకున్న తరువాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురవుతూ ..మాట్లాడారు. జట్టుకు నా యవ్వనాన్ని, నా పతాక స్థాయిని, అనుభవాన్ని ఇచ్చానని వెల్లడించారు. ఈ గెలుపు ఆర్సీబీ అభిమానులకు, జట్టుకే కాదు నాకూ ప్రత్యేకమే అని తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని చెప్పారు. చివరికి ఐపీఎల్ కప్ అందుకోవడం నమ్మశక్యం కాని భావన అంటూ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురవుతూ ..మాట్లాడారు. ఐపీఎల్ కెరీర్ చివరి రోజు వరకూ ఆర్సీబీతోనే ఉంటానని ప్రకటించారు. బెంగుళూరు నా హృదయం, నా ఆత్మ అన్నారు కింగ్ కోహ్లీ.  ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో… తన జన్మ ధన్యమైంది అన్నారు. టీమిండియా కు ఐసీసీ టోర్నమెంట్ వచ్చినట్లుగానే తనకు ఇప్పుడు ఫీలింగ్ ఉందని… చెప్పుకొచ్చారు

ALSO READ:  WI Team In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వెస్టిండీస్… ఆగిపోయిన టాస్… క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×