MI VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ 12వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Kolkata Knight Riders ) మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్… గ్రాండ్ విక్టరీ కొట్టింది. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. బౌలింగ్ లో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు తీయగా… ముంబై బ్యాటర్ రికెల్టన్ హాఫ్ సెంచరీ తో రెచ్చిపోయాడు.
Also Read: IPL 2025: KKR కోట కూల్చిన ముంబై కుర్రాడు.. ఎవరీ అశ్వని కుమార్!
దీంతో ముంబై ఇండియన్స్ అవలీలగా విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై ఏకంగా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. 12.5 ఓవర్లలోనే… రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది ముంబై ఇండియన్స్. చివర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు సూర్య కుమార్ యాదవ్.
అశ్వని కుమార్ దెబ్బకు కుప్పకూలిన కోల్కత్తా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 16.2 ఓవర్లలోనే కోల్కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) 116 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ముంబై ( Kolkata Knight Riders ) యంగ్ బౌలర్ అశ్వని కుమార్ అద్భుతంగా బౌల్… చేయడంతో కుప్పకూలింది కేకేఆర్. ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ యంగ్ బౌలర్ అశ్వని కుమార్ ( Ashwani Kumar ). మూడు ఓవర్లు వేసిన అశ్వని కుమార్ 24 పరుగులు ఇచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. అలాగే ట్రెంట్ బోల్ట్ ( Trent Boult ) నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. దీపక్ చాహర్ ( Deepak Chahar) రెండు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మళ్లీ అతనికి బౌలింగ్ వేసే ఛాన్స్ రాలేదు.
Also Read: HCA – SRH: HCA-SRH పంచాయతీ…. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) కూడా 2 ఓవర్లు వేసి పది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. విగ్నేష్ రెండు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. మిచల్ శాంట్నర్ కూడా మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ఇక ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ లో రోహిత్ శర్మ 12 బంతుల్లో 13 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. ఒక సిక్సర్ కొట్టిన తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు రోహిత్ శర్మ. విల్ జాక్స్ కూడా 17 బంతుల్లో 16 పరుగులు చేసి… అవుట్ అయ్యాడు. రికెల్టన్ 62 పరుగులు చేయగా.. సూర్య కుమార్ యాదవ్ 27 పరుగులు చేశాడు.