Lucky Baskhar Collections: ఈరోజుల్లో హీరోలకు ఎంత పాపులారిటీ లభించినా, వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉన్నా.. వారి సినిమాలకు సరిపడా కలెక్షన్స్ రాకపోతే, కోట్లలో రికార్డులు కొల్లగొట్టకపోతే టైర్ 1 హీరోల కేటగిరిలో స్థానం సంపాదించుకోలేరు. చాలామంది హీరోలు కలెక్షన్స్ గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నా.. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందించాలని అనుకున్నా.. వారికి మార్కెట్ పెరగాలంటే సినిమాలకు కలెక్షన్స్ రాక తప్పదు. మొత్తానికి మంచి నటుడు అని పేరు తెచ్చుకున్న ఇన్నేళ్ల తర్వాత దుల్కర్ సల్మాన్ కూడా రూ.100 కోట్ల హీరోల కేటగిరిలో చేరాడు. ఆ క్రెడిట్ పూర్తిగా ‘లక్కీ భాస్కర్’ సినిమాకే దక్కుతుంది.
మార్కెట్ పెరిగింది
మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).. తన తండ్రి బాటలో కాకుండా ఫీల్ గుడ్ జోనర్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూశాడు. దగ్గరయ్యాడు కూడా. దుల్కర్ సల్మాన్ సినిమాలంటే కచ్చితంగా బాగుంటాయని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అలా మాలీవుడ్‌లో దుల్కర్‌కు ఒక మార్క్ క్రియేట్ అయిపోయింది. కానీ తన సినిమాల కలెక్షన్స్ అంతంత మాత్రమే. తన యాక్టింగ్ టాలెంట్‌తో ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టాడు ఈ హీరో. అప్పటినుండి తన మార్కెట్ పెరిగింది. తాజాగా విడుదలయిన ‘లక్కీ భాస్కర్’ అనే తెలుగు సినిమాతో తన మార్కెట్ రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.
Also Read: దయచేసి నాకు అటువంటి టైటిల్స్ పెట్టకండి, నన్ను మామూలుగా గుర్తించండి చాలు
ఈజీగా సాధించవచ్చు
దీపావళి సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్‌గా తెలుగులో తెరకెక్కిన ఈ మూవీ తమిళ, మలయాళంలో కూడా విడుదలయ్యింది. అన్నింటిలో కంటే తెలుగులోనే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలయ్యి 11 రోజులు అవుతున్నా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమాకు రూ.96.8 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ థియేటర్లలో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది కాబట్టి ‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ సెంచరీ కొట్టడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
జస్ట్ మిస్
దుల్కర్ సల్మాన్ ఇప్పటికీ నేరుగా తెలుగులో మూడు సినిమాల్లో నటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించాడు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత అదే నిర్మాణ సంస్థతో చేతులు కలిపి ‘సీతారామం’ చేశాడు. ఈ సినిమాతో తను కూడా ఒక తెలుగు హీరో అయిపోయాడు. అప్పటివరకు తమిళ హీరోలకే తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాంటిది ‘సీతారామం’ తర్వాత దుల్కర్ కూడా అంతే ఆదరణ సంపాదించుకున్నాడు. అయినా ఆ మూవీకి అప్పట్లో కేవలం రూ. 98.1 కోట్లు మాత్రమే వచ్చాయి. జస్ట్‌లో సెంచరీ మిస్ అయ్యింది. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’తో కచ్చితంగా రూ.100 కోట్ల మార్క్ టచ్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
#LuckyBaskhar has a spectacular 2nd weekend at the box office, now gearing up to hit the prestigious 100CR+ mark! 💸💥
The 𝑴𝑬𝑮𝑨 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 grossed over 𝟗𝟔.𝟖 𝐂𝐑+ in 𝟏𝟏 𝐃𝐀𝐘𝐒 Worldwide!💰🔥
Watch #BlockbusterLuckyBaskhar at Cinemas Near you – Book your… pic.twitter.com/mbb0wuCdZo
— Sithara Entertainments (@SitharaEnts) November 11, 2024